కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ

Published Sun, Feb 9 2014 3:36 AM

allu keshav venkata jogi naidu join to in ysr congress party

సాక్షి ప్రతినిధి, విజయనగరం :కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొ న్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, నిన్న గురా న సాధూరావు పార్టీని విడిచిపెట్టగా నేడు ఎస్. కోట నే త అల్లు కేశ వెంకటజోగినాయుడు గుడ్‌బై చెప్పేశారు. ఆయనతో పాటు మరో 800 మంది పార్టీకి రాజీనామా చేశారు. ఇలా నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని విడిచి పెట్టేస్తున్నారు. మున్ముందు ఆ పార్టీ మరింత ఖాళీ అయ్యే అవకాశం కన్పిస్తోంది. ప్రజా వ్యతిరేకతే కారణం : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అ నుకూలంగా ఉండడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజ ల్లో ఆదరణ పెరుగుతుండడంతో పట్టుకోల్పోతున్న ఆ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరు జారుకుంటున్నా రు. మొన్నటికి మొన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ న్నదొర  తన అనుచర వర్గంతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరగా, ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత గురాన సాధూ రావు రాజీనామా చేశారు.
 
 తాజాగా ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌చార్జి అల్లు కేశ వెంకట జోగినాయుడు పా ర్టీకి రాంరాం చెప్పేశారు. ఆయనతో పాటు మరో 800 మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో అనేక మంది సర్పంచ్ లు ఉన్నారు. వీరంతా ఆదివారం శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అల్లు కేశ వెంకట జోగినాయుడు నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపనున్నారు. గత ఎన్నికల్లో స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందా రు. కాం గ్రెస్ రెబెల్ అభ్యర్థి ఇందుకూరి రఘురాజు పోటీ చేయకపోయి ఉంటే సులభంగా గెలిచేవారు. వెలమ సామాజికవర్గంలో మంచి పట్టు ఉన్న అల్లు చేరికతో వైఎస్సార్ సీపీ మరింత బలపడనుంది. త్వరలో మున్సిపల్ మా జీ చైర్‌పర్సన్ మీసాల గీత కూడా కాంగ్రెస్ గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీ మున్ముందు మరింత ఖాళీ అయ్యే పరిస్థితి స్పష్టమవుతోంది.  
 
 మనస్తాపంతోనే రాజీనామా: అల్లు
 ధర్మవరం (శృంగవరపుకోట రూరల్) : రాష్ట్ర విభజన కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తో మనస్తాపం చెంది ఆ పార్టీకి రాజీనా మా చేస్తున్న ట్టు ఎస్. కోట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లు జోగినాయుడు ప్రకటించారు. శనివారం ఆయన ధర్మవరం పంచాయతీ శివారు సన్యాసే శ్వర స్వామి ఆలయ సమీపంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెంది న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందు గా పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెజార్టీ సభ్యుల కోరిక మేరకు శ్రీకాకుళంలో జరిగే సమైక్య శంఖారావంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేర  నున్నట్టు ప్రకటించారు.జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో రాజకీ య సుస్థిరత ఏర్పడుతుందని తెలిపారు
 
 .రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండగలమని ప్రశ్నించారు. అరుుతే జోగినాయుడు నిర్ణయంపై మెజార్టీ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.సమావేశంలో ధర్మవరం సర్పం చ్ గొర్లె దేముడు, మామిడిపల్లి సర్పంచ్ టి. గంగాభవాని, వేములాపల్లి సర్పంచ్ అల్లు శ్రీనివాసరావు, ఆ లుగుబిల్లి సర్పంచ్ కాశీవిశ్వనాథం, బొడ్డవర సర్పంచ్ భర్త టి. సాంబరాజు, మాజీ సర్పంచ్‌లు కారుకొండ శ్రీను, కేజీపూడి మాజీ సర్పంచ్ మెరపల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి రాములు, మోపాడ గౌరినాయుడు,వేమలి సన్యాసప్పడు, వైఎ స్సార్ సీపీ నేతలు యడ్ల అప్పలనాయుడు, అప్పారా వు, కొప్పాక లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement