మళ్లీ తెరపైకి‘అనంత స్వర్ణమయం’ | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి‘అనంత స్వర్ణమయం’

Published Tue, Sep 9 2014 3:21 AM

మళ్లీ తెరపైకి‘అనంత స్వర్ణమయం’

  •     ఆలయానికి బంగారు తాపడం చేయాలని మంత్రి యనమల ప్రకటన
  •      అన్నీ సవ్యంగా ఉంటే పరిశీలిస్తామంటున్న టీటీడీ ఈవో గోపాల్
  • సాక్షి, తిరుమల: ‘ఆనంద నిలయం-అనంత స్వర్ణమ యం’ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. చిన్న ఆలయాలే బంగారంతో కనిపిస్తుంటే.. కోట్లకు పడగలెత్తిన తిరుమల ఆలయానికి బంగారు తొడుగులు, పూత చేయొచ్చని స్వయంగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ప్రకటించారు. అన్నీ సవ్యంగా ఉంటే పరిశీ లిస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా ప్రకటిం చారు. కోర్టు ఉత్తర్వులతో అర్ధాంతరంగా ఆగిపోయిన దివంగత  టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవులు కలల ప్రాజెక్టు మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
     
    స్వర్ణమయం రూపకల్పన

    తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రాకారాలకు బంగారు తొడుగులు అమర్చేందుకు 2008 అక్టోబరు 1వ తేదీన అప్పటి చైర్మన్ డీకే ఆదికేశవులు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును రూపకల్పన చేశారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు కోసం భక్తులు రూ.13 కోట్ల నగదు, 115 కేజీల వరకు బంగారాన్ని కానుకగా సమర్పించారు. తిరుమల మ్యూజియంలో ప్రత్యేకంగా వర్క్ షాపు ఏర్పాటు చేసి రాగి రేకులపై  బంగారు మలాం వేశారు.  దీనిపై ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం తెలిపింది.

    ప్రాకారంపై బంగా రు తొడగులు అమర్చితే అక్కడున్న పురాతన శాసనాలు  కనుమరుగవుతాయని ఎత్తిచూపింది. దీంతో అప్పటి చైర్మన్ ఆదికేశ వులు ఆలయ ప్రాకారంపై  ఉన్న శాసనాలను ఎస్టాంపేజెస్ పద్ధతిలో సేకరించి వాటిని సీడీలు, పుస్తకాల్లో భద్ర పరిచారు. అయితే, అప్పటి టీటీడీ  ఈవో ఐవైఆర్ కృష్ణారావు అనంత స్వర్ణమయం పనుల్ని నిర్మొహమాటంగా వ్యతిరేకిం చారు. టీటీడీ తనవంతుగా కోర్టుకు అఫిడవిట్ కూ డా సమర్పించింది. హ కోర్టు ఉత్తర్వులతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆ తర్వాత డీకే ఆదికేశవులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పనులు పునఃప్రారంభం కాలేదు. స్వర్ణమయం ప్రాజెక్టును రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
     
    మంత్రి మాటలతో తిరిగి ఆజ్యం

    2500 కోట్ల బడ్జెట్ కలిగిన తిరుమల ఆలయం ఎప్పు డో దశాబ్దాలకు ముందు వేసిన తాపడంతోనే కని పించడం సరికాదని ఇటీవల తిరుమలలో మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పక్కనే తమిళనాడులోని వేలూరులో స్వర్ణదేవాలయం దగదగ మెరిసిపోతోంది. తిరుమల దేవుడికి డబ్బులు తక్కువా? అంటూ ఎత్తిచూపారు. తిరుమల ఆల యానికి తప్పకుండా బంగారు తాపడం పనులు చేస్తే బాగుంటుం దని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

    మంత్రి స్వయంగా చెప్పడం చూస్తే ఆనం ద నిలయం అనంత స్వర్ణమయం పనులు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీకే  ఆదికేశవులు సతీమణి డీకే సత్యప్రభ ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అర్ధాం తరంగా ఆగి పోయిన ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసేందుకు డీకే కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోం ది. వారి సూచనతోనే మంత్రి యనమల రామకృష్ణుడు బంగారం  తాపడం పనులు గురించి ప్రస్తావించాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రాజె క్టు వ్యయాన్ని కూడా భరించేందు కు డీకే కుటుంబం వెనక్కు తగ్గదని కొందరు టీటీడీ అధికారులు చెబుతుండడం గమనార్హం.
     
    కోర్టు ఇబ్బందులు లేకుంటే పరిశీలిస్తాం

    తిరుమల శ్రీవారికి ఆలయానికి బంగారు తాపడం పనులకు సంబంధించి కోర్టు వివాదాలు నడిచా యి. అందువల్లే టీటీడీ కూడా అనంత స్వర్ణమయం ప్రాజె క్టు పనులపై వెనకడుగు వేసింది. తాజాగా టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా సానుకూలంగా స్పందించారు. ‘కోర్టు వివాదాలు లేకుండా అన్నీ సవ్యంగా ఉంటే పరిశీలిస్తాం’ అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే స్వర్ణమయం పనులు చేసేందుకు టీటీడీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుస్తోంది. దీంతో స్వర్ణమయం పనులు మళ్లీ తెరపైకి రావడం టీటీడీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
     

Advertisement
Advertisement