టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా వీరే..

19 Sep, 2019 21:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో ఏడుగురుని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌ లోకల్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు గోవింద హరి, ఢిల్లీ లోకల్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు రాకేశ్‌ సిన్హా, ముంబై లోకల్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అమోల్‌ కాలే, బెంగుళూర్‌ లోకల్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, భువనేశ్వర్‌ లోకల్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు దుష్మత్‌ కుమార్‌, చెన్నై లోకల్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఏజే శేఖర్‌లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 29 మందితో టీటీడీ 50వ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి రూపొందనుంది. ఎంపికైన వారు సెప్టెంబ‌రు 23న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం కానుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు