అది ఆవిర్భావం కాదు.. విద్రోహదినం | Sakshi
Sakshi News home page

అది ఆవిర్భావం కాదు.. విద్రోహదినం

Published Tue, Jun 3 2014 1:43 AM

అది ఆవిర్భావం కాదు.. విద్రోహదినం

 శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణా ఆవిర్భావదినోత్సవం కాదని...తెలుగుజాతి విద్రోహదినం అని సిటిజన్స్ ఫోరం, తెలుగు రచయితల వేదిక, హిందీమంచ్ ప్రతినిధులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో సిటిజన్స్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, హిందీమంచ్ జిల్లా అధ్యక్షుడు వాడాడ సన్యాసిలు మాట్లాడారు.
 
 తెలుగు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను రెండు రాష్ట్రాలుగా విభజించడం బాధకారమన్నారు. విభజించిన రాష్ట్రాలలో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక దుర్ధినమన్నారు. దీనికి నిరసనగానే నల్లబ్యాడ్జీలు ధరించామన్నారు. హిందీమంచ్ ప్రతినిధి కోనె శ్రీధర్, పండిత పరిషత్ ప్రతినిధి పూడి జనార్ధనరావులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలంతా ఒక్కో సైనికునిలా కష్టపడి అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
 
మనకు కావాల్సినన్ని వనరులు ఉన్నాయని వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఆంధ్ర అభివృది ్ధచెందుతుందన్నారు. దీనికై ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. సమావేశంలో హిందీమంచ్, తెరవే, సిటిజన్స్‌ఫోరం ప్రతినిధులు జి.వి.నాగభూషణరావు, సదాశివుని శంకరరావు, ఎం.వాసుదేవాచారి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement