ఎక్కడివారు అక్కడే | Sakshi
Sakshi News home page

ఎక్కడివారు అక్కడే

Published Tue, Feb 25 2014 4:15 AM

ఎక్కడివారు అక్కడే - Sakshi

తమ డిమాండ్ల సాధనకోసం సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. వాహనాల్లో వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుండా నిర్భందచర్యలకు దిగడం దుర్మార్గమని అంగన్‌వాడీలు మండిపడ్డారు.     
 

 

 అడ్డాకుల : జిల్లాలోని గద్వాల, ధరూర్, అ యి జ, మల్దకల్, గట్టు, వనపర్తి, కొత్తకో ట, అడ్డాకుల, వీపనగండ్లతో పాటు అ నం తపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగళి, అమరాపురం, గుడిబం డ, రోళ్ల మండలాలకు చెందిన అంగన్‌వా డీ కార్యకర్తలను శాఖాపూర్ టోల్‌ప్లాజా వ  ద్ద పోలీసులు అడ్డుకున్నారు. రెండు ప్రై వేట్ బస్సులు, 15కు పైగా క్రూజర్ వాహనా ల్లో ఉన్న సుమారు 400 మందిని అరెస్ట్‌చేసి అడ్డాకుల ఠాణాకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు.
 

షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ శివారులోని జీ ఎంఆర్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీం తో అంగన్‌వాడీ కార్యకర్తలు సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ధర్నాచేపట్టారు.
 

జిల్లాకేంద్రంలో అంగన్‌వాడీ టీచర్లను, హెల్పర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

మక్తల  నియోజకవర్గంలోని మాగనూర్, ఊట్కూర్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాగనూర్‌లో పోలీస్‌స్టేషన్ ఎదుట కార్యకర్తలు ధర్నాచేపట్టారు.
 

 

నారాయణపేట, ధన్వాడ, మరికల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్ట్‌చేసి ‘పేట’, మరికల్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మరికల్ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం తర్వాత అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు.
  కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్తున్న అంగన్‌వాడీలను బొంరాస్‌పేట మండలం మెట్లకుంట తండా వద్ద చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి మండలాల తరలివెళ్తున్న సుమారు 200 మందిని బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడిచిపెట్టారు.

 

  కల్వకుర్తి నుంచి వెళ్తున్నవారిని కడ్తాల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ని రసనగా కార్యకర్తలు  శ్రీశైలం-హైదారాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రెండున్నర గంటల పాటు రాస్తారోకో చే పట్టారు. ఆమనగల్లు సీఐ ఫజ్లూర్ రెహమాన్ కడ్తాలకు చేరుకుని వారిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 

 

అచ్చంపేట, వంగూరు, లింగాల మం డ లాల నుంచి వెళ్తున్న అంగన్‌వాడీలను పో లీసులు అడ్డుకున్నారు. లింగాలలో పో లీస్ట్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వా రు సాయంత్రం వరకు అక్కడే బైఠాయిం చారు. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అ ధ్యక్షురాలు పార్వతమ్మను అరెస్ట్‌చేసి అచ్చంపేట పీఎస్‌కు తరలించారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement