సాక్షి ప్రతినిధి, విజయనగరం : అంగన్వాడీ పోస్టులను అమ్ముకుంటున్నారా? లేక తమ పార్టీకి చెందిన వారికే కట్టబెట్టేటట్టు అధికార పార్టీ నాయకులు ముందస్తు ప్రణాళికలు రచించుకున్నారా? అంటే అవుననే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. జిల్లాలోని అంగన్వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరు అనుమానాలకు తావిస్తోంది. కొంతమందిని ఇంటర్వ్యూలకు పిలవకపోవడం, పిలిచిన వారికి కూడా ఇంటర్వ్యూలు చేయకుండా పంపేయడం వంటి సంఘటనలతో బాధిత మహిళలు ఆక్రోశిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా ఇంట ర్వ్యూ నిర్వహణలో పాలుపంచుకోవడం ఎంత వరకూ సబబని వారు ప్రశ్నిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు ఈ మేరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అక్రమంగా పోస్టులను కట్టబెడుతున్నారని అధికసంఖ్యలో ఫిర్యాదు చేశారు. మీకు నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టినప్పుడు.. మమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలవడం ఎందుకని నేతలనుద్దేశించి అధికారులను బహిరంగంగా ప్రశ్నించారు. మహిళల ఆరోపణలు, జరిగిన సంఘటనలు చూస్తే ఇంటర్వ్యూలన్నీ ముందస్తు ప్రణాళికతో జరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ క్రింది ఉదాహరణలు చూస్తే అవి నిజమని చెప్పక తప్పదు.
కొత్తవలస మండలం ఉత్తరాపల్లి మధుర గ్రామమైన గాంధీ నగరం అంగన్వాడీ సెంటర్ కార్యకర్త పోస్టు కోసం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో ముగ్గురికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి, మిగిలిన వారిని వెళ్లిపొమన్నారని పోస్టుకు దరఖాస్తు చేసుకున్న గ్రామానికి చెందిన మరడాన నాగమణి అనే మహిళ ఆరోపించారు. మమ్మల్ని అన్యాయం గా ఉదయం నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు కార్యాలయం వద్ద ఉంచేశారని ఆవేదన చెందారు. తీరా సాయంత్రం అయ్యేసరికి ఇళ్ల కు తిరిగి వెళ్లిపోమన్నారని వాపోయారు. చం టిపిల్లల తల్లులు, గర్భిణులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి కోటి ఆశలతో ఇంటర్వ్యూలకు వస్తే కనీసం ఇంటర్వ్యూ కూడా నిర్వహిం చపోవడం దారుణమన్నారు.
పాచిపెంట మండలం కందిరివలసకు చెం దిన పిల్లి యశోదకు ఎన్నికల ముందు ఇంట ర్వ్యూలకు రమ్మని పిలుపు వచ్చింది. ఎన్నికల కోడ్ అడ్డం రావడంతో ఇంటర్వ్యూలను ఆపేసి వారందరికీ ఇప్పుడు నిర్వహించా రు. కానీ పిల్లి యశోదకు మాత్రం ఇంటర్వ్యూ లెటర్ రా లేదు. అయినా లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే సీడీపీఓ అడ్డుకున్నారనీ, ఇక్కడి నుంచి వెళ్లిపొమన్నారని ఆమె ఆవేదన చెందు తూ జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ కంటే ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చిన కాంతమ్మ అనే మహిళకు పోస్టు కట్టబెట్టేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని నెల్లిమర్ల ప్రాజెక్టు పరిధిలోని బొప్పడాం గ్రామానికి చెందిన మజ్జి హైమావతి, పతివాడ పైడిరాజు ఆరోపిస్తూ ఫిర్యాదుచేశారు. ఈ మూడు చోట్లే కాదు అంగన్వాడీ కార్యకర్తల, ఆయాల నియామకాల న్నింటిలోనూ ఈ తతంగమే సాగింది. జిల్లా వ్యాప్తంగా 36అంగన్వాడీ కార్యకర్తలు, 66 హెల్పర్లు, 86 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 226 లింక్ వర్కర్ల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. వీటి నియామకాలు దాదాపు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగాయి.
అర్హులను పక్కన పెట్టి తమకు కావలసిన వారిని భర్తీ చేశారని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదుచేసిన పలువురు ఆరోపించారు. లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల తాకిడి చూస్తే అంగన్వాడీ పోస్టుల భర్తీ ఎంత అడ్డగోలుగా జరిగిందో స్ప ష్టమవుతోంది. బాధితుల ఆక్రందనలతో కలెక్టరేట్ హోరెత్తింది.జిల్లా కో ఆర్డినేటర్ (ఒకటి), జిల్లా అసిస్టెంట్ కో ఆర్డినేటర్(ఒకటి), 12బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్లు, 17 అసిస్టెంట్ బ్లాక్ లెవెల్ కో ఆర్డినేటర్ పోస్టుల కోసం మంగళవారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వీటికి ఇప్పటికే బేరసారాలు జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఏకపక్షంగా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలు, సిఫారసులుంటే చాలు పోస్టు వచ్చేస్తుందన్న ఆరోపణ గట్టిగా విన్పిస్తోంది.
అంగట్లో పోస్టులు?
Published Tue, Sep 30 2014 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement