ఏపీ సచివాలయంలో వాస్తుదోషం...! | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో వాస్తుదోషం...!

Published Wed, Jul 5 2017 1:57 PM

ఏపీ సచివాలయంలో వాస్తుదోషం...! - Sakshi

అమరావతి: వాస్తు నెపంతో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మరోసారి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. వాస్తు దోషం ఉందంటూ అధికారులు కొత్తగా మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొత్త గేటు పెట్టేందుకు ప్రహారీ గోడ కూల్చివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ కోసం మంత్రుల బ్లాక్‌ల వెనుక ఉన్న రహదారిని ఎమర్జెన్సీ రహదారిగా మార్చివేశారు. ఆ రహదారిలో ఎలాంటి వాహనాలు పెట్టరాదని ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే ఉన్న నాలుగు గేట్లకు అదనంగా మరో గేటు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  వాస్తు ప్రకారం అయిదో గేటు ఉండాలనే సూచనతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వాస్తు దోషం నేపథ్యంలో సచివాలయంలో పలుమార్లు మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రుల చాంబర్లతో పాటు వివిధ నిర్మాణాలకు సంబంధించి సుమారు ఏడెనిమిది సార్లు మార్పులు చేపట్టారు. వాస్తు పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement