మన్యంలో మరో ఉద్యమం | Sakshi
Sakshi News home page

మన్యంలో మరో ఉద్యమం

Published Sat, Sep 12 2015 11:36 PM

మన్యంలో  మరో ఉద్యమం - Sakshi

బాక్సైట్‌పై పోరాటానికి గిరిజనులు సిద్ధం
దోపిడీ కోసమే చంద్రబాబు అరకు దత్తత
అసెంబ్లీలో స్పీకర్‌లా వ్యవహరించిన పోలీసులు
రాజేంద్రపాలెం ప్రజా చైతన్య సదస్సులో అమర్‌నాథ్

 
కొయ్యూరు : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపృితే స్వాతంత్య్ర ఉద్యమం నాటి మన్యం పితూరిలా మరో పోరా టం తప్పదని వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నా రు. బాణాలు ఎక్కుపెట్టయినా బాక్సై ట్‌ను అడ్డుకుంటామన్నారు. మండల కేం ద్రం కొయ్యూరులో ప్రజా వ్యతిరేక విధానాలపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన  చైతన్య సదస్సును శనివారం నిర్వహించారు. అమర్‌నాథ్ మాట్లాడుతూ పోలీసుల తూటాలకు భయపడే స్థితిలో గిరిజను లు లేరన్నారు. బాక్సైట్‌ను దోపిడీ చేసేందుకే సీఎం చంద్రబాబు అరకును, మరో మంత్రి లంబసింగిని దత్తత తీసుకున్నారని ఆరోపించారు. ఖనిజ తవ్వకాలతో  రైవాడ జలాశయం పూర్తిగా ఎండిపోతుందన్నారు. మైదానంలోని తాండవ వంటి మేజర్ ఆయుకట్టుకు సాగునీరందక బంగారం పండే భూృుులు బీడువారుతాయన్నారు. సమావేశానికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు మొదటి నుంచి ఇబ్బం దులు పెట్టారన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు హాజరు కావలసి ఉండగా ఎస్పీ నుంచి అనుమతి లేకపోవడంతో నలుగురు మాత్రమే వచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు  రోజా దీనికి రావలసి ఉండగా.. ఆమె వస్తే సమావేశానికి అనుమతి ఇచ్చేది లేదని చెప్పడం శోచనీయమన్నారు. రోజాకు భయపడే రానీయలేదని ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్సార్ సీపీ నేత అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్‌లా పోలీసులు కట్ చేయడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటయిన ఐటీడీఏలు వారి బాగును పట్టించుకోవడం లేదన్నారు. హోరున వర్షం కురుస్తున్నప్పటికీ మధ్యాహ్నం 12.30 గం టల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గిరిజనులు అలాగే ఉన్నారు. సమావేశంలో అరకు పార్లమెంట రీ నియోజకవర్గం పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీలు పోలుపర్తి నూకరత్నం, పద్మకుమాని, నళిని కృష్ణ, ఎంపీపీ  బాలరాజు,  నేతలు కర్రినాయుడు,  టీఎస్ రాందాస్,గాడి సత్యనారాయణృ, ఎస్‌వి రమణమూర్తి, రంపచోడవరానికి చెందిన రామకృష్ణ, జీకేవీధి, చింతపల్లి, జి. మాడుగుల, పాడేరు,పెదబయలు ప్రాంతాలనుంచి వచ్చిన నాయకులు,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రామరాజ్యం సీపీఎం నుంచి బూరుగులయ్య, పీసా కమిటీల నుంచి ప్రసాద్ పాల్గొన్నారు.
 
 సర్వశక్తులు ఒడ్డి అడ్డుకుంటాం
 సర్వశక్తులు ఒడ్డి బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం. నాడు వందేమాతర ఉద్యమం మాదిరి బాక్సైట్ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అణిచివేయాలనిచూస్తే  తిరుగుబాటు తప్పదు. సంప్రదాయ ఆయుధాలతో పోరాటం సాగిస్తాం. గిరిజనం నోరునొక్కేస్తున్న ప్రభుత్వానికి  గిరిజనం తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు. అర్హులకు అందడం లేదు. 50 ఏళ్లు నిండిన అందరికి పెన్షన్లు అని చెప్పి ఇప్పుడు లేవంటూ మెలిక పెడుతున్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా ప్రత్యేకప్యాకేజీఅంటూ ప్రజలను మోసం  చేస్తున్నారన్నారు.
 - గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు  
 
 బాక్సైట్‌పై నోరు నొక్కేసిన ప్రభుత్వం
బాక్సైట్‌పై నోరు తెరవగానే ప్రభుత్వం దానిని బయటకు రాకుండా నొక్కేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షం సభ్యలుమాట్లాడే సమయంలో స్పీకర్ ఎలా మైక్ కట్ చేస్తారో ఇక్కడ కూడా పోలీసులు అదే విధంగా చేశారు.  సభకు అధ్యక్షత వహించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడిన అనంతరం మాజీ ఎమ్మెల్యే జి. దేముడు మాట్లాడుతూ బాక్సైట్ అంశాన్ని ప్రస్తావించగానే సీఐ సోమశేఖర్ మైక్ కట్‌చేశారు. దీంతో పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు వాగ్వాదం చోటుచేసుకుంది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement