ఏపీ బడ్జెట్‌లో వాటికే అధిక ప్రాధాన్యత! | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Published Mon, Jun 15 2020 8:17 PM

AP Assembly Session Will Start  From Tomorrow - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను మంత్రులు వరుసగా ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు.

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి  అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (కరోనా: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరీక్షలు)

బడ్జెట్‌ సమావేశం విశేషాలు..

  • 16వ తేదీ ఉదయం 10 గంటలకు  వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం
  • 11:30 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం. 
  • అనంతరం తిరిగి సభ ప్రారంభం. 
  • గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం- చర్చ
  • గవర్నర్‌ ప్రసంగంపై ముఖ్యమంత్రి సమాధానం
  • 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • అదేసమయంలో శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
  • సాధారణ బడ్జెట్‌ అనంతరం సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ఆ శాఖ మంత్రి కన్నబాబు
  • శాసనమండలిలో  వ్యవసాయ బడ్జెట్‌ / పద్దును మండలిలో ప్రతిపాదించనున్న మంత్రి మోపిదేవి వెంకటరమణ
  • 17వ తేదీ మధ్యాహ్నం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం  సాధారణ బడ్జెట్‌పై పరిమిత స్థాయిలో చర్చ
  • చర్చకు మంత్రి సమాధానాలు - బడ్జెట్‌కు ఆమోదం - సభ వాయిదా
  • 18 వ తేదీ - అసెంబ్లీ / మండలి సమావేశాలు ఉండవు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు మాత్రమే ఉంటాయి
  • 19 వ తేదీ - రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ - లెక్కింపు - ఫలితాల వెల్లడి - గెలుపొందిన సభ్యుల స్పందనలు 

Advertisement
Advertisement