చంద్రబాబు బ్రాహ్మణులను మోసం చేశారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బ్రాహ్మణులను మోసం చేశారు

Published Fri, Nov 10 2017 6:54 AM

ap brahman President suresh meet ys jaganmohan reddy - Sakshi

కడప కార్పొరేషన్‌: బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1,500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌ సురేష్‌ బాబు కోరారు. గురువారం ఆయన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ దివంగత వైఎస్‌ఆర్‌ పాలనలో అర్చకులకు ధూపదీప నైవేద్య పథకం పేరుతో 8 నుంచి 13 వేల ఆలయాలకు రూ.2,500 చొప్పున ఇచ్చారన్నారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేవలం రూ.165 కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేశారన్నారు.

అంతేగాకుండా వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకానికి తూట్లు పొడిచి ఆలయాల సంఖ్యను 3 వేలకు కుదించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించి, అర్చకులకు రూ.15 వేల జీతాన్ని ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ కోరినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అరసవెల్లి దేవాలయాల వరకూ చైర్మన్, డైరెక్టర్‌ పదవుల్లో స్థానం కల్పించాలని కోరారు.

Advertisement
Advertisement