వచ్చే నెల 2 నుంచి రాష్ట్ర పునర్ నిర్మాణ వారోత్సవాలు | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 2 నుంచి రాష్ట్ర పునర్ నిర్మాణ వారోత్సవాలు

Published Mon, May 4 2015 8:28 PM

ap cabinet meeting

హైదరాబాద్: వచ్చే నెల రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ రాష్ట్ర పునర్ నిర్మాణ వారోత్సవాలు జరపాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కార్యక్రమాలు, ఎనిమిదో తేదీన పునరంకిత సభ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం సమావేశమైన ఏపీ కేబినెట్ దాదాపు పది గంటలపాటు పలు అంశాలపై చర్చించారు.  ఈ నెల 6 నుంచి ప్రాజెక్టుల నిద్ర కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆరు ప్రాధాన్యత ప్రాజెక్ట్ లతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శించనున్నారు. దీంతో పాటు నీరు-చెట్టు పథకం, గ్రామ సభలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డులో తూడా చైర్మన్ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..

* ప్రభుత్వ బదిలీపై నిషేధం ఎత్తివేత
* ఈ-పాస్ మిషన్ల విధానాన్ని రేషన్ షాపుల్లో కొనసాగించడం.. కొత్త రేషన్ కార్డుల జారీ చేయడం
* మే నెలాఖరు లోపు కొత్త మద్యం పాలసీ ఖరారు చేయడం
* ఇసుక అమ్మకాలు పెంచడం
* జొన్నాడ మృతులకు మేజర్ కు రూ.5 లక్షలు, మైనర్ రూ. 2 లక్షలు చెల్లింపు
* మే 17 నుంచి రైతు రుణమాఫీ విజయయాత్ర చేయాలని నిర్ణయం.
* డ్వాక్రా మహిళలకు 30 శాతం రుణమాఫీ కింద2800 కోట్ల రూపాయల కేటాయింపు. 1286 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాలని నిర్ణయం.
* జూన్ 6న సీఎం చంద్రబాబు తోటపల్లి ప్రాజెక్టు సందర్శన.
* జూన్ 8న పురంకిత సభ
* జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయం.

Advertisement
Advertisement