ఏపీ సీఐడీకి రెండు స్కోచ్‌ అవార్డులు | Sakshi
Sakshi News home page

ఏపీ సీఐడీకి రెండు స్కోచ్‌ అవార్డులు

Published Sat, Jan 11 2020 8:46 PM

AP CID get Two SKOCH awards - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అధికారులు అమలు చేస్తున్న ఈ-లెర్నింగ్‌, పీసీఆర్‌ డాష్‌ బోర్డు విధానానికి రెండు స్కోచ్‌ అవార్డులు, ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఒక అవార్డు దక్కాయి. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ అందుకున్నారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం తదితర చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తూ సీఐడీ నిర్వహిస్తున్న ఈ లెర్నింగ్‌ ప్రోగ్రాంకు స్కోచ్‌ అవార్డు లభించింది.

అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు పలు పౌర హక్కులను పర్యవేక్షించే ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌(పీసీఆర్‌) డాష్‌ బోర్డు పనితీరుకు మరో అవార్డు దక్కింది. దీనితోపాటు ప్రొజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు మరో స్కోచ్‌ అవార్డు దక్కింది. మూడు స్కోచ్‌ అవార్డులు అందుకున్న అధికారులకు అభినందనలు తెలుపుతూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement