ఖజానా.. బజానా | Sakshi
Sakshi News home page

ఖజానా.. బజానా

Published Thu, May 22 2014 1:03 AM

ఖజానా.. బజానా

కొవ్వూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పింఛన్, డీఏ బకాయిల మొత్తాలను ముందస్తుగా చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. వీటికి సంబంధించిన బిల్లుల స్వీకరణకు బుధవారంతో గడువు ముగిసింది. ఖజానా (ట్రెజరీ) నుంచి జరిపే చెల్లింపులను ఈనెల 24వ తేదీలోగా పూర్తి చేయూలని ఆర్థికశాఖ నుంచి జీవో 86 రూపంలో ఆదేశాలు జారీ అయ్యూయి. దీంతో ట్రెజరీ అధికారులు, ఉద్యోగులు ఆ పనుల్లో తలమునకలయ్యారు. చెల్లింపులకు మూడు రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో జీతాలు, ఇతర బిల్లులకు సంబంధించిన మొత్తాలు చేతికి అందుతాయో లేదోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడనున్నారుు. ఈలోగా ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం బిల్లుల చెల్లింపులను పూర్తి చేయూలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది.
 
 ఇప్పటికిప్పుడు చెల్లించాల్సింది రూ.96.35 కోట్లు
 ఆర్థిక శాఖ నిర్ణయం ప్రకారం జిల్లాలో 30 వేల మంది ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.50.45 కోట్లు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రూపంలో రూ.45.90 కోట్లు కలిపి మొత్తం 96.35 కోట్లను ఈనెల 24వ తేదీన చెల్లించాల్సి ఉంది. జిల్లా ట్రెజరీ కార్యాలయంతోపాటు 14 సబ్ ట్రెజరీ కార్యాల యాల ద్వారా ఈ మొత్తాలను బట్వాడా చేయూలి. రాష్ట్ర విభజన కు జూన్ 2వ తేదీని ‘అపాయింటెడ్ డే’గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వారం రోజుల ముందుగానే చెల్లింపులను పూర్తి చేయూల్సి ఉంది. జీతభత్యాలు, పింఛన్లతోపాటు డీఏ బకాయిలు, ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ట్రెజరీలకు సమర్పించ డానికి సైతం బుధవారంతో గడువు ముగిసింది. వీటితోపాటు పంచాయతీరాజ్, ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, డైట్, కాంట్రాక్ట్ వర్క్స్ తదితర బిల్లులను కూడా 24వ తేదీలోగానే క్లియర్ చేయూల్సి ఉంది.
 
 చెల్లింపులకు మూడు రోజులే వ్యవధి
 ఇప్పటికే బిల్లులు సమర్పించిన వారికి మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాలు అందించడం కష్టసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో బిల్లులను సమర్పించలేని వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన ఆయూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక లోటు బడ్జెట్‌తో పాలన ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయం ఉద్యోగులను వెంటాడుతోంది.
 
 పని ఒత్తిడి లో ట్రెజరీ ఉద్యోగులు
 ఉద్యోగులు, పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన బిల్లులతోపాటు జూన్ 1వ తేదీ జీతం, పెన్షన్ బిల్లులను ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంది. దీంతో ట్రెజరీ అధికారులు రెండు బిల్లులను పాస్ చేయూల్సిన పరిస్థితి నెలకొంది. జూన్‌లో కేవలం ఒక రోజుకు మాత్రమే బిల్లులు చేయూల్సి ఉన్నా.. నెల రోజుల బిల్లుల చెల్లింపులకు ఎంత సమయం పడుతుందో.. ఒక్క రోజు బిల్లుకు కూడా అంతే సమయం పడుతుంది. వీటికితోడు డీఏ బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న  కొందరు ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవులకు జీతాలు పొందలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఆ బిల్లులు కూడా జత కావడంతో ట్రెజరీ అధికారులు, ఉద్యోగులపై పని ఒత్తిడి బాగా పెరిగింది. ఉదాహరణకు ప్రతినెలా ఒక్కో సబ్ ట్రెజరీ కార్యాలయూనికి 500 బిల్లుల చొప్పున వస్తే ఈనెల మాత్రం నాలుగు రెట్లు బిల్లులు అదనంగా వచ్చాయి. ఈ దృష్ట్యా సకాలం బిల్లులు పాస్ అవుతాయో లేదోననే భయూందోళనలు ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొన్నాయి.
 
 అమలుకు నోచుకోని ఈ-చెల్లింపులు
 ఉద్యోగులకు త్వరితగతిన జీతభత్యాలు అందించాలన్న ఉద్దేశంతో మార్చి నుంచి అమలులోకి తెచ్చిన ఈ-చెల్లింపుల విధానం జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. పోలవరం, ఏలూరు ట్రెజరీ కార్యాలయాల్లో మాత్రమే ఈ-చెల్లింపుల విధానం ప్రారంభించారు. ఇక్కడ కూడా జీతభత్యాలు మినహా ఇతర బిల్లుల్ని మాత్రమే ఈ-విధానంలో చెల్లిస్తున్నట్టు జిల్లా ట్రెజరీ అధికారి ఎస్‌వీకే మోహన్‌రావు తెలిపారు.
 
 10 రోజులపాటు తాళం!
 ఆర్థిక శాఖ ఆదేశాల నేపథ్యంలో ఈనెల 24 నుంచి ట్రెజరీ కార్యాలయూల ద్వారా చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తారు. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యూక కొత్త పద్దులు తెరవాల్సి ఉంది. ఆ తరువాత బడ్జెట్ల వారీగా నిధులు జమ కావాల్సి ఉంటుంది.  ఈ దృష్ట్యా కనీసం 10 రోజులపాటు ట్రెజరీ కార్యాలయూలు పనిచేసే అవకాశం కనిపించడం లేదు.
 

Advertisement
Advertisement