వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు

Published Wed, Jan 18 2017 4:31 PM

వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు - Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వైఎస్సార్ సీపీ రూట్ మ్యాప్ ప్రకారం జగన్ పర్యటనకు అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. తాము చెప్పిన మార్గంలోనే పర్యటన చేయాలంటూ షరతులు పెట్టారు.

పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నేతలు తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత పర్యటనపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధాని బాధిత రైతులను పరామర్శించకూడదా అని నిలదీశారు. జగన్ వస్తున్నారని తెలియగానే రంగంలోకి దిగిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు నిన్న లింగాయపాలెం గ్రామస్తులను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారు వెనక్కు తగ్గారు.

వైఎస్ జగన్ రేపు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు నుంచి జగన్ పర్యటన ప్రారంభమవుతుందని ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు లింగాయపాలెం చేరుకుని బాధిత రైతులతో జగన్ మాట్లాడతారని చెప్పారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement