'అందరితో పాటు మమ్మల్ని ముంచావ్‌ బాబు' | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఏపీ పాత్రికేయుల మండిపాటు

Published Tue, Mar 6 2018 12:24 PM

Ap Journalists Fires on Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు : ప్రజా సమస్యలను వెలికితేసే పాత్రికేయులను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారని ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టులు మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ఇచ్చిన హామీలను వెంటనే  నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా విలేకరులు కర్నూలు కలెక్టరేట్‌ ముందు ఆందోళన నిర్వహించారు. ఏపీయూడబ్య్లూజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశౠరు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసినట్లే, జర్నలిస్టులను కూడా మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం  పాత్రికేయులకు ట్రిపుల్‌ బెడ్‌రమ్‌ ఇల్లు, అక్రిడేషన్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల జరిగిన ఆందోళనల్లో పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 60 శాతం రాయితీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జర్నలిస్టుల రూ. 200 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

చిత్తూరు
చిత్తూరు జిల్లాలో సైతం పాత్రికేయులు ఆందోళన బాట పట్టారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ విమర్శించారు. జర్నలిస్టులకు సంక్షేమ నిధి, అక్రిడేషన్‌, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

కడప
కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జర్నలిస్టులకి ఇచ్చిన హామీలు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అక్రిడేషన్లు మంజూరు చేయాలని కలెక్టర్ బాబురావుకు వినతి పత్రం అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement