ఏపీ రాజధాని అభివృద్ధికి విరాళాల స్వీకరణ | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధాని అభివృద్ధికి విరాళాల స్వీకరణ

Published Thu, Jun 12 2014 12:43 AM

Ap new capital development fund formed

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అభివృద్ధికోసం విరాళాలు స్వీకరించడానికి వీలుగా ‘ఏపీ న్యూ కేపిటల్ డెవలప్‌మెంట్ ఫండ్’ పేరిట నిధి ఏర్పాటైంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి బుధవారం తెలిపారు. దాతలు చెక్కులు, డీడీలను ‘కార్యదర్శి, రెవెన్యూ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ పేరిట హైదరాబాద్ గౌలిగూడ ఎస్‌బీఐలో చెల్లుబాటయ్యేలా పంపాలని సూచించారు. చెక్కులు, డీడీలను ‘కార్యదర్శి, రెవెన్యూ శాఖ(సీఎంఆర్‌ఎఫ్), సచివాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్-22’కు పంపించాలని కోరారు.
 

Advertisement
Advertisement