మహిళా ప్రోత్సాహంపై స్పష్టత ఉంది | Sakshi
Sakshi News home page

మహిళా ప్రోత్సాహంపై స్పష్టత ఉంది

Published Mon, Feb 13 2017 2:56 AM

మహిళా ప్రోత్సాహంపై స్పష్టత ఉంది - Sakshi

ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు  

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి: ఆడ బిడ్డలను ప్రోత్సహించడంలో తాను చాలా స్పష్టతతో ఉంటానని, వీటిపై తనకు రెండో అభిప్రాయం వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని ఉండదని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్, పార్లమెంటు సదస్సు నిర్వాహకుడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎవరైనా తనపై చెడు అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నిస్తే అది అవాస్తవం అవుతుందని, మహిళలకు వ్యతిరేకమైనవి తన నోటి వెంట రావని, చేతల్లో కూడా జరగవని మరోసారి మనవి చేసుకుంటున్నానన్నారు. చివరి రోజున ఆదివారం మహిళా పార్లమెంటు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు మూడు రోజు ల పాటు బ్రహ్మాండంగా జరిగిందన్నారు. కార్యక్ర మం ఎంత గొప్పగా జరిగినా చెడగొట్టడానికి ఎక్కడో ఒక చిన్న ప్రయ త్నం జరిగిందని తాను అనుకుంటున్నానని కోడెల అన్నారు. యువ మహిళలు, ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారు చేసిన ప్రసంగాలు విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రజా ప్రతినిధులు, ఏపీ కి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు హాజరై తమ అనుభవాలను పంచుకున్నార న్నారు. మొత్తం మీద ఈ మహిళలంతా తమ ఆకాంక్షలకు అనుగుణంగా సూచనలు చేసి యావత్‌ మహిళా లోకానికే దిక్సూచిగా నిలి చారని కోడెల అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement