ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల

Published Mon, Jul 2 2018 11:47 AM

AP TET Results 2018 Released By Minister Ganta Srinivasa Rao - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నం ఏయూలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్‌ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 57.48 శాతం మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,97,957 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా 3,70,573 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 2.13 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మొత్తం 113 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులకు జూలై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25, 26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్‌ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి గంటా గతంలో వెల్లడించారు.

Advertisement
Advertisement