‘అలాంటి తల్లుల కోసమే ‘జగనన్న అమ్మఒడి’’ | Sakshi
Sakshi News home page

మా ప్రభుత్వం మహిళల పక్షపాతి: వాసిరెడ్డి పద్మ

Published Fri, Sep 13 2019 5:45 PM

AP Women Commission Chairperson Vasireddy Padma Visits East Godavari - Sakshi

తూర్పు గోదావరి: మహిళల పక్షపాతిగా పని చేయాల్సిన బాధ్యత మహిళా కమిషన్‌పై ఉందన్నారు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. శుక్రవారం తూర్పుగోదావరి పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం నవతరం ఎక్కువ సమయం విద్యాసంస్థల్లో గడుపుతున్నారన్నారు. అందువల్ల విద్యార్థులు ఎలా ఉండాలి అనే విషయం గురించి విద్యాసంస్థలే వారికి బోధించాలని సూచించారు. మంచి మార్గంలో నడిస్తే కలిగే లాభాలు ఏంటి.. లేదంటే కలిగే నష్టాలు ఏంటి అనే అంశాల గురించి విద్యార్థులకు బోధించాలని తెలిపారు.

ఆ తల్లులే మాకు స్ఫూర్తి: ఆదిమూలపు సురేష్‌
మహిళలను చిన్నచూపు చూసే ఆలోచన నుంచి బయటకు రావాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడే నేతలను గత ప్రభుత్వంలో చూశామన్నారు. తమ ప్రభుత్వంలో పథకాలన్ని మహిళలకు సహకరించేవే అని స్పష్టం చేశారు. పిల్లల తలరాత మార్చాలని కృషి చేసే తల్లులే తమకు స్ఫూర్తి అన్నారు. అలాంటి తల్లుల కోసమే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement