ఏలూరులో ఏపీఎన్జీవోల నేతల ధర్నా, అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ఏలూరులో ఏపీఎన్జీవోల నేతల ధర్నా, అరెస్ట్

Published Fri, Jan 3 2014 6:02 PM

APNGOs leaders arrested protest to Samaikya andhra bandh

ఏలూరు: రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిర్వహించిన సమైక్యాంధ్ర బంద్ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఏపీఎన్జీవోల నేతలు శుక్రవారం ధర్నాకు దిగారు.  రంగంలోకి దిగిన పోలీసులు ఏపీఎన్జీవోల నేతలను అరెస్ట్ చేసి ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏపీఎన్జీవోలు ధర్నాకు దిగారు. వారి ఆందోళనకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు తెలిపగా, ధర్నాకు వద్దకు వైఎస్ ఆర్ సీపీ నేత ఆళ్లనాని చేరుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సమైక్య వాదులు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలు వ్యాపార సంస్థలు... స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

Advertisement
Advertisement