3న ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ నిలిపివేత | Sakshi
Sakshi News home page

3న ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ నిలిపివేత

Published Mon, Mar 31 2014 3:22 AM

APSRTC online ticket booking on 3 Dropping

హైదరాబాద్: ఏప్రిల్ 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ ఆన్‌లైన్ ప్యాసింజర్ టికెట్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్‌ఎస్) అందుబాటులో ఉండదు. నిర్వహణ నిమిత్తం ఓపీఆర్‌ఎస్ సేవలను ఒక రోజు నిలిపివేయనున్నట్లు సంస్థ ఈడీ ముక్కాల రవీందర్ ఆదివారం తెలిపారు. ఈ సమయంలో ఆర్టీసీ కౌంటర్లు, ఏజెంట్లు, ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు వీలు కాదన్నారు.

ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారు వాటిని రద్దు చేసుకోవాలనుకుంటే ఆ వివరాలు పేర్కొంటూ (ౌజ్ఛీ.టఠఞఞౌట్టః్చఞటట్టఛిౌజ్ఛీ.జీ)కు ఈ-మెయిల్ పంపించాలని సూచించారు. సాధారణ టికెట్ల రద్దుకు ఆర్టీసీ కౌంటర్లలో సంప్రదించాలన్నారు. ప్రయాణ తేదీలను మార్చుకోవడానికి ఈ సమయంలో అనుమతించబోమని, రిజర్వేషన్లు, టికెట్ల రద్దు, ప్రయాణాల వాయిదా.. ముందుగానే చేసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement