మంత్రుల తీరు బాధించింది! | Sakshi
Sakshi News home page

మంత్రుల తీరు బాధించింది!

Published Fri, Sep 12 2014 1:58 AM

మంత్రుల తీరు బాధించింది! - Sakshi

 సాలూరు:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు వ్యవహరించిన తీరు తనతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ ఎంతగానో బా ధించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూ టీ ఫ్లోర్‌లీడర్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై చర్చించేలా చూడాలని కోరారు.
 
 గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో  మాట్లాడారు. తాను ఇప్పటివరకు మూడు సభల్లో పాల్గొన్నానని, కానీ ఎప్పుడూ ఇలాంటి సభను చూడలేదన్నారు. మంత్రులు మాట్లాడే తీరు చాలా బాధి కలిగించిందని చెప్పారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు అవమానకరంగా మాట్లాడడం, సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బ్లాక్ మెయిల్‌కు దిగడం విచారకరమన్నారు. అందుకే తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షా ...ప్రభుత్వంలో ఉన్నది మేమా, లేక టీడీపీ వాళ్లా అన్న అనుమానం కలుగుతోందని స్పీకర్‌ను ప్రశ్నించాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
 
 పతి పక్షం, ప్రభుత్వంపై సమస్యలపై దాడి చేయడం పరి పాటని, కానీ ప్రజా సమస్యలు అడిగిన ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం శోచనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు తమ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బ్లాక్ మెయి ల్‌కు దిగుతున్నారన్నారు. గృహ నిర్మాణ రుణాలు మంజూరు కాక, మం జూరైన వారికి బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందు లు గురువుతున్నారని తాను సభ దృష్టికి తీసుకువెళితే జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని సాలూరు నియోజకవర్గంలో కూడా అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారన్నారు. అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి కాని లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తాను తిప్పికొట్టాల్సి వచ్చిందన్నారు.
 
  ఇదే తీరు ప్రతి పక్ష సభ్యులందరిపైనా మం త్రులు కనపరిచారన్నారు. ఎంతసేపూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారే గాని ఆయనపై కేసులు విచార ణ దశలో ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోకుండా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూ డా చాలా ఆరోపణలున్నాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించుకుని మచ్చలేని నాయకుడిగా నిరూపించుకున్నప్పుడే జగన్‌ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు ఉంటుందని తెలిపారు.
 
 ఏమీ లేకపోతే చంద్రబాబుపై విచారణకు హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సిన పని ఏమొచ్చిందని ప్రశ్నించారు. మొదటిసారిగా ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యేలను శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశార న్నారు. తమది రైతు ప్రభుత్వమని చెబుతున్న టీడీపీ నాయకులు జిల్లాలోని ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం దాదాపు 16 వేల మంది రైతులకు రూ. 28 కోట్ల చెల్లించకుండా రోడ్డెక్కేలా చేస్తే.. ఆ విషయమై చర్చిద్దామని సభలో అడిగితే కొట్టిపారేశారన్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహరించే తీరని ప్రశ్నించారు. మంత్రులు నిబద్దతతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగుం టుందని సూచించారు.  ఈఏడాది చివరలో జరగనున్న శాసన సభలోనైనా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement