వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి

Published Sat, Apr 4 2015 2:15 AM

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి - Sakshi

మారణాయుధాలతో తరమికొట్టిన టీడీపీ వర్గీయులు

అనకాపల్లి రూరల్: మరిడిమాంబ జాతరలో వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో ప్లెక్సీల ఏర్పాటును టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో తెగబడ్డారు. గురువారం రాత్రి మండలంలోని కొత్తతలారివానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడుల్లో నారిపిన్ని చంద్రశేఖర్, పడాల రాజు, ఆట్టా లక్ష్మిలకు గాయాలయ్యాయి. గ్రామస్తులంతా చందాలు వేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

కానీ సర్పంచ్ చీకటి రాంబాబు సొంత నిధులతో వీటిని నిర్వహిస్తున్నట్టు టీడీపీ వారు ప్రచారం చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీయడంతో సర్పంచ్ అనుయాయులయిన నారపిన్ని రమణ, అప్పారావు, తలారి నీలిబాబు, పూర్ణచంద్రరావు, చింతల పరమేశ్వరరావు, మరికొందరు దాడులకు పాల్పడ్డారు. కర్రలు, కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ఇళ్లల్లోకి చొరబడి మరీ కొట్టారు. నారిపిన్ని చంద్రశేఖర్, పడాల రాజులకు తలమీద, అట్టా లక్ష్మికి కడుపులో గాయాలయ్యాయి.

ప్రస్తుతం వీరు ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారిపిన్ని చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తమనూ కొట్టారంటూ టీడీపీ కార్యకర్త బుదిరెడ్డి అప్పలరాజు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారిపిన్ని చంద్రశేఖర్, పడాల రాజుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. రూరల్ సీఐ కె.ఎన్.ఎస్.వి. ప్రసాద్ రూరల్ ఎస్‌ఐ కోటేశ్వరరావు ఉదయాన్నే ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement