సైబర్‌ నేరాలు సవాళ్లుగా మారాయి: మంత్రి అవంతి

21 Oct, 2019 11:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు యూనిఫాంకు ఒక గౌరవం ఉందని, యూనిఫాంకు ఇచ్చే గౌరవాన్ని చూసే చాలామంది యువత పోలీసు ఉద్యోగాల్లో చేరుతున్నారని తెలిపారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తూ.. అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.  పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని ఆలోచించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీక్లీ ఆఫ్‌ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ గుర్తు చేశారు.

రాష్టంలో తీవ్రవాదం, నక్సలిజం రెండింటినీ పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారని, గంజాయి స్మగ్లింగ్‌ను రూరల్‌ పోలీసులు నియంత్రణలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అదే విధంగా విశాఖకు సైబర్‌ నేరాలు సవాళ్లుగా మారాయని.. అనేకమంది చిన్నారులు ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా డబ్బులు నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వీటిని పోలీసులు నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి టెక్నాలజీని వాడుకోవాలని మంత్రి సూచించారు.

మరిన్ని వార్తలు