బాబు పర్యటనతో ఒరిగింది శూన్యం | Sakshi
Sakshi News home page

బాబు పర్యటనతో ఒరిగింది శూన్యం

Published Sun, Feb 15 2015 1:07 AM

బాబు పర్యటనతో ఒరిగింది శూన్యం - Sakshi

 శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాటాడారు.నరసన్నపేటలో సీఎం పర్యటన కేవలం కాలక్షేపానికే తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదన్నారు. బాబు పర్యటన సందర్భంగా జిల్లాలో వచ్చే నెలలో లక్ష పెన్షన్లు ఇస్తానని, డ్వాక్రా సంఘాలను ఆదుకుంటానని, మత్స్యకార పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్‌లో చేరుస్తామని, నరసన్నపేటలో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, సారవకోటలో బొంతు వద్ద రూ.175 కోట్ల తో ఎత్తిపోతల పథకం, జిల్లాలో వంద రోజుల్లో లక్ష మరుగుదొడ్లు, పైడిభీమవరంలో నాలుగు కంపెనీలు, జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు.. ఇలా మరిన్ని వీలుకాని, ఆచరణలో అమలు సాధ్యంకాని హామీలను సీఎం గుప్పించారని పేర్కొన్నారు. జిల్లావాసుల అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
 మహిళా సంఘాలకు రుణామఫీ ఏదీ?
 జిల్లాలో రుణమాఫీ ప్రక్రియను నిలిపివేసి రైతులను న ట్టేట ముంచారన్నారు. జిల్లాలో 39వేల మహిళా సంఘాలు ఉండగా ఒక్క మహిళా సంఘానికీ రుణమాఫీ జరగలేదన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి తన మానసపుత్రికలంటూ ఆ మహిళా సంఘాలనే మట్టుపెట్టేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శిం చారు. వంశధార రెండోదశ పనుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. హుదూద్ తుపానులో దెబ్బతిన్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని హామీఇచ్చి, వాటిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.
 
 ఈ హామీలు మరిచారా సీఎంగారూ?
 ఆమదాలవలసలో చక్కెర కర్మాగారం తెరిపించి ప్రజలకు అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని మరిచారన్నారు. భావనపాడు షిప్పింగ్‌హార్బర్‌ను బాగు చేయిస్తానని, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణం చేపడతానని చెప్పి వాటి ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. జిల్లాలో జీడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి జీడిపరిశ్రమను ఆదుకుంటామన్నారని, అయితే వాటి ప్రస్తావనే చేయకపోవడం దారుణమన్నారు. ఇటీవల ఎగువసీది గ్రామంలో జ్వరంతో నలుగురు చనిపోగా 15మంది జిల్లా వైద్యశాలల్లో వైద్యం పొందుతున్నారన్నారు. గిరిజనులపై ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపకపోవడం దుర్మార్గమన్నారు.

విభజన సమయంలో రాష్ట్రానికి 11 జాతీయ సంస్థలు కేటాయిస్తామన్నారని, అందులో ఒక్క జాతీయ సంస్థ కూడా రాలేదన్నారు. రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల అృవద్ధికి దివంగత  వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతోృకషిచేశారని, చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాల్లో జరిగే వివాహ వేడుకల మాటున జిల్లాపర్యటనలకు రావడం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లా సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక పర్యటనలు పెట్టుకుని ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని శాంతి డిమాండ్ చేశారు.  అలా పర్యటనలకు వచ్చి అడ్డగోలు హామీలు గుప్పించి పర్యటనలు ముగించడం చంద్రబాబు రాజకీయ ప్రాపకానికి ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, గొర్లె రాజగోపాల్, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, లబ్బ శ్రీను, ఎృకష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement