బాబుదొక మాట ..అధికారులది ఇంకోమాటా ? | Sakshi
Sakshi News home page

బాబుదొక మాట ..అధికారులది ఇంకోమాటా ?

Published Thu, Oct 9 2014 3:34 AM

బాబుదొక మాట ..అధికారులది ఇంకోమాటా ? - Sakshi

గూడూరు టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు మహిళలు తీసుకున్న రుణాలను చెల్లించొద్దని చెబుతుంటే సంబంధిత అధికారులు మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారని జన్మభూమి కార్యక్రమంలో పొదుపు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 4,6, 10 వార్డుల్లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమా న్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా 4వ వార్డు పూలతోట గిరిజన ప్రాధమిక పాఠశాల ఆ వరణలో జరిగిన కార్యక్రమంలో మహిళలు అధికారులను నిలదీశారు. రైతులు, పొదుపు మహిళలు తీ సుకున్న రుణాలను కట్టొద్దని ప్రతిరోజూ టీవీలు, పత్రికల్లో చంద్రబాబు బహిరంగ ప్రకటనలు చేస్తుంటే అధికారులు మాత్రం రుణాల రికవరీకి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. వెంటనే డ్వాక్రా రు ణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మ ద్దతు ప్రకటించారు. ఒకదశలో వైఎస్సార్సీపీ కౌ న్సిలర్లు మెప్మా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. సామాజిక పింఛన్ల కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు చోటు కల్పించి అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. అవకతవకలు జరిగితే సహించబోమని హెచ్చరించారు. అర్హులకు పింఛన్లు అం దేలా చూస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు.

 అభివృద్ధి పథంలో నడిపేందుకే...
 రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకే సీఎం చంద్రబాబు జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మున్సిపల్ చైర్‌పర్సన్ దేవసేన అన్నా రు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలన, చెట్టు-నీరు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది లాంటి ప ధకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అనురాధ, వార్డు సభ్యులు చోళవరం గిరిబాబు, గోవిందు మస్తానమ్మ, గుండాల భారతి,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement