బాలయ్య చిర్రుబుర్రు | Sakshi
Sakshi News home page

బాలయ్య చిర్రుబుర్రు

Published Sat, Jun 24 2017 10:09 AM

బాలయ్య చిర్రుబుర్రు - Sakshi

హిందూపురం అర్బన్‌: ఎట్టకేలకు మూడు నెలల తర్వాత శుక్రవారం తన నియోజకవర్గానికి వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొలిరోజే కార్యకర్తలు, అభిమానులపై చిర్రుబుర్రులాడారు. దీంతో చాలామంది ఆయన ఎదుటపడకుండా పక్కకు తప్పుకున్నారు.

తొలుత మండల కేంద్రమైన చిలమత్తూరు నుంచి బైక్‌పై వస్తున్న బాలకృష్ణ.. లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాస్పత్రి భవనం ప్రారంభ సమయంలో ఫొటోలకు అడ్డొస్తున్నాడని 11వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ రామ్మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కేశవులును కూడా పక్కకు వెళ్లమని ఆదేశించారు. మరోవైపు పూజ జరిగేటప్పుడు కూడా ఓ అర్చకుడిపైన బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లోనూ బాలకృష్ణ ఇలాగే చిర్రుబుర్రులాడేవారు.

Advertisement
Advertisement