నేడు ఖమ్మంలో ‘బంగారు బతుకమ్మ’ | Sakshi
Sakshi News home page

నేడు ఖమ్మంలో ‘బంగారు బతుకమ్మ’

Published Sun, Oct 6 2013 5:16 AM

Bangaru Bathukamma celebrations will be held at khammam today: Eswarapragada Haribabu

ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ‘బంగారు బతుకమ్మ’ను భారీగా నిర్వహించనున్నట్టు ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ కన్వీనర్ ఈశ్వరప్రగడ హరిబాబు తెలిపారు. ఆయన శనివారం ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాపరిషత్ వద్ద ఆదివారం సాయంత్రం బతుకమ్మల శోభాయాత్రను తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారని చెప్పారు. ఈ యాత్ర నయాబజార్ కళాశాల వరకు సా గుతుందని, అనంతరం అక్కడ బతుకమ్మ ఆట-పాట, సభ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్య లో మహిళలు, 250మంది కళాకారులు పాల్గొంటారని చె ప్పారు. కార్యక్రమంలో ఉత్తమంగా ఎంపిక చేసిన నాలుగు బతుకమ్మలకు వరుసగా 5000, 3000, 2000, 1000 రూ పాయల నగదు బహుతులను డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కెవి.కృష్ణారావు సహకారంతో ఇవ్వనున్నట్టు తెలిపారు.
 
 ఖమ్మంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పలు కార్యక్రమాలలో కల్వకుంట్ల కవిత పాల్గొంటారని చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు స్థంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తారని, 10:30 గంటలకు బైపాస్ రోడ్డులో తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 11 గంటలకు టీఎన్‌జీఓ కార్యాలయంలో బతుకమ్మల పేర్పులో, మధ్యాహ్నం 12 గంటలకు సంభాని నగర్‌లో టీజేఏసీ నిర్వహించే బతుకమ్మ సంబురాలలో పాల్గొంటారని అన్నారు. మూడు గంటలకు మామిళ్ళగూడెంలోని రామాలయం వద్ద బతుకమ్మ సంబురాలలో, సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కోర్టు ప్రాంతంలో న్యాయవాదుల జేఏసీ నిర్వహించే బతుకమ్మ ఆట-పాట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా నాయకుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఉస్మాన్ పాషా, కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు తానిపర్తి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
 
 జయప్రదం చేయండి
 ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ సం సృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నగరంలో ఆదివారం జరిగే ‘బంగారు బ తుకమ్మ’ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిం డిగల రాజేందర్ ఒక ప్రకటనలో కోరా రు.కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మహి ళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement