బ్యాంకు ఖాతా తప్పనిసరి | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా తప్పనిసరి

Published Sun, Jan 4 2015 3:28 AM

బ్యాంకు ఖాతా తప్పనిసరి - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఈనెల 8వ తేదీలోగా బ్యాంకు ఖాతా తెరవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న జన్‌ధన్ యోజనలో భాగంగా అందరూ ఖాతాలు తెరవాలన్నారు.  రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించటానికి ప్రజ లంతా సహకరించాలని కోరారు. ప్రతి ప్రాంతానికి కేటాయించిన సర్వీస్ బ్యాంకులకు ఆధార్ కార్డుతో వెళ్తే ఒక్క రోజులో  ఖాతా ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే ఖాతాలు ప్రారంభించి రూపే డెబిట్ కార్డు అందని వారు కూడా సంబంధిత బ్యాంకును సంప్రదించి, కార్డు తీసుకోవాలన్నారు. బ్యాంకర్లు సహకరించకపోతే తనకు లేదా లీడ్ బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రతి బ్యాంకరు ఆ గ్రామంలో లేదా వార్డులో అన్ని ఖాతాలు ప్రారంభించాం..ఇక ప్రారంభించటానికి ఎవరూ లేరని సర్పంచ్ లేదా కౌన్సిలర్‌తో ధ్రువీకరణ పత్రం పొంది లీడ్ బ్యాంకు మేనేజర్‌కు అందజేయాలని ఆదేశించారు. పథకానికి సంబంధించి ఇప్పటివరకు 3.75 లక్షల ఖాతాలు ప్రారంభమయ్యాయన్నారు. మరో 45 వేల ఖాతాలు ప్రారంభిం చాల్సి ఉందని తెలిపారు. వీరంతా ఈనెల 8వ తేదీ లోగా ఖాతాలు ప్రారంభించాలన్నారు. భవిష్యత్తులో అన్ని చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని,ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా అవసరమన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
 

Advertisement
Advertisement