అప్పు చెల్లించలేదని నెలగా గృహనిర్బంధం | Sakshi
Sakshi News home page

అప్పు చెల్లించలేదని నెలగా గృహనిర్బంధం

Published Thu, Jul 2 2015 2:59 AM

barrowers

కదిరి: అప్పు సకాలంలో చెల్లించనందుకు ఓ మ హిళను మరో మహిళ నెల రోజులుగా గృహ నిర్బంధం చేసిన సం ఘటన  కదిరి పట్టణం లో చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ సాగర్ చొరవతో బుధవారం సాయంత్రం ఆమెకు విముక్తి కలిగింది. ఓడిచెరువు మండలం దాదారెడ్డిపల్లికి చెందిన రజనీకి కదిరి మండలం కౌలేపల్లికి చెందిన చంద్రశేఖర్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె 2 ఏళ్లుగా భర్తకు దూరంగా కదిరి పట్టణంలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఆమె కదిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో కాపురం ఉండే పుష్పలత అలియాస్ బుజ్జి అనే మహిళ దగ్గర చిట్టీ వేసి పాడుకుంది. రెండు నెలల తర్వాత డబ్బులు చెల్లించడం మానేసింది. దీనికి తోడు తాను ఇబ్బందుల్లో ఉన్నానంటూ అప్పుడప్పుడు మరికొంత డబ్బు పుష్పలత దగ్గర తీసుకుంది. చిట్టీ డబ్బులతో పాటు మొత్తం రూ 3.80 లక్షలు ఆమె అప్పుగా తీసుకొని కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చేసింది. అక్కడ ఓ పోలీస్ అధికారి ఇంట్లో పని చేస్తుండేది. నెల క్రితం ఈమె కదిరి ఆర్‌టీసీ బస్టాండ్‌లో కన్పించడంతో పుష్పలత తన ఇంటికి తీసుకె ళ్లింది.
 
 ఇవ్వాల్సిన అప్పు చెల్లించే వరకూ ఇక్కడే ఉండాలని ఆదేశించింది. 2 రోజుల కిత్రం పుష్పలతతో సహజీవనం చేస్తున్న వ్యక్తి డబ్బు చెల్లించనందుకు రజనీ ఒంటిపై వాతలు వచ్చేలా కొట్టాడు. ఎవరో సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్‌ఐ సాగర్‌కు బుధవారం సిబ్బందితో వెళ్లి ఆమెకు విడిపించారు. పుష్పలతను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై పుష్పలత మీడియాతో మాట్లాడుతూ ‘తోటి మహిళ ఇబ్బందుల్లో ఉందని సుమారు రూ 4 లక్షలు అప్పు ఇస్తే మోసం చేసి హైదరాబాద్‌కు పరారైందన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement