మద్యం దుకాణం దగ్ధం | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణం దగ్ధం

Published Sat, Aug 16 2014 2:07 AM

మద్యం దుకాణం దగ్ధం - Sakshi

  • రూ.10 లక్షల విలువైన మద్యం నిరుపయోగం
  •  కైకలూరు మండలం వింజరం గ్రామంలో ఘటన
  • వింజరం (కైకలూరు) : మండలంలోని వింజరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మద్యం దుకాణం, ఓ పూరిల్లు కాలిపోయాయి.  వివరాల ప్రకారం.. కలిదిండి మండలం ఆవకూరు గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్యకు చెందిన ఈ దుకాణా న్ని ఇటీవలే ఏర్పాటు చేశారు.

    షాపులోనుంచి శుక్రవారం తెల్లవారుజామున మంటలు వస్తుండటాన్ని అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. కైకలూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పోలీసులు, గుమస్తా కొండవీటి వెంకట కృష్ణ తెలి పిన వివరాల ప్రకారం గురువారం సా యంత్రం దుకాణాన్ని మూసి వెళ్లారు. దుకాణం వద్ద ఓ వ్యక్తి రోజూ బజ్జీలు అ మ్ముకుంటూ వెనుకభాగంలోని పాకలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడు కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు.

    ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తి పాకకు నిప్పంటించడంతో మంటలు  వ్యాపించి ఉంటాయని   భా విస్తున్నారు. ఈ ఘటనలో రూ. 10 లక్షలు విలువ చేసే మద్యం పాడైందని, రూ.80 వేల నగదు కాలిపోయిందని నష్టపోయామని గుమస్తా చెబుతున్నాడు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగిందని భావించడానికి ఈ దుకాణానికి విద్యుత్ సర్వీసు లేదు. జనరేటర్‌ను వాడుతున్నారు. ఎవరో నిప్పంటించి ఉంటారని పోలీ సు లు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి శకలాలు రోడ్డుపైన, పక్కన ఉన్న పొలంలో పడ్డాయి.

    ఈ ఘటన జరిగినప్పుడు జనసంచారం ఉంటే ప్రమాదబారిన పడేవారని స్థానికులు చెబుతున్నారు. దుకాణం వెనుక నివసిస్తున్న బజ్జీల వ్యాపారితో విరో ధం ఉన్నవారు ఎవరైనా ఈ పని చేశారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. టీడీపీ కలి దిండి మండల అధ్యక్షుడు శ్రీని వాసచౌదరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై టౌన్ అదనపు ఎస్‌ఐ షబ్బిర్ అ హ్మద్ కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
     

Advertisement
 
Advertisement
 
Advertisement