కొత్తపేటలో బీటీ రోడ్ల నిర్మాణం | Sakshi
Sakshi News home page

కొత్తపేటలో బీటీ రోడ్ల నిర్మాణం

Published Sat, Jun 4 2016 12:09 AM

Beatty roads in kothapet

వన్‌టౌన్ : కొత్తపేటలోని పలు రోడ్లలో గురువారం నగర పాలక సంస్థ అధికారులు బీటీ రోడ్ల నిర్మాణం చేశారు. అందులో భాగంగా గణపతిరావురోడ్డులో గురువారం రాత్రి నుంచి పనులు నిర్వహించారు. బాబురాజేంద్రప్రసాద్‌రోడ్డులో ఇటీవల బీటీ రోడ్డు వేసిన అధికారులు దానిని అనుకొని ఉన్న గణపతిరావురోడ్డులో కూడా కింగ్‌హోటల్ సెంటర్ నుంచి నెహ్రూబొమ్మ సెంటర్ వరకూ గురువారం రాత్రి నుంచి పనులు ప్రారంభించారు.

శుక్రవారం ఉదయం పది గంటల వరకూ పనులను నిర్వహించారు. గణపతిరావురోడ్డులో వాహనాలు రాకుండా బాబురాజేంద్రప్రసాద్ రోడ్డులోని రాయల్‌హోటల్ సెంటర్ నుంచి గులాంమొహిద్దీన్ వీధి, కోమల విలాస్ సెంటర్ కేటీరోడ్డు మీదుగా నెహ్రూబొమ్మ సెంటర్‌కు వాహనాలను మళ్లించారు. వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కోమలవిలాస్ సెంటర్‌లో వాహనాలు మలుపు తిప్పటానికి డ్రైవర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
 
 

Advertisement
Advertisement