‘బెల్టు’ నిర్వాహకుల్లో మహిళలే అధికం! | Sakshi
Sakshi News home page

‘బెల్టు’ నిర్వాహకుల్లో మహిళలే అధికం!

Published Sat, Jun 21 2014 5:10 AM

‘బెల్టు’ నిర్వాహకుల్లో మహిళలే అధికం! - Sakshi

జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వెలమల నరేష్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కొంతమంది మహిళలే మద్యం బెల్టుషాపులు నిర్వహించడం విచారకరమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వెలమల నరేష్ అన్నారు. స్థానిక మహిళా ప్రాంగణంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టుషాపుల వల్ల ఎంతోమంది అమాయక మహిళలు ఇబ్బందికి గురవుతున్నారన్నారు. అటువంటి వాటిని తరిమికొట్టాలని పిలుపుని చ్చారు.ఆడపిల్లను అయితే ప్రభుత్వ పాఠశాలలోనూ, మగపిల్లవాడిని అయితే ప్రైవేట్ పాఠశాల లోనూ కొంతమంది తల్లిదండ్రులు చేర్పిస్తున్నారని, అలా చేయడం తగదన్నారు.

ఆడైనా, మగైనా సమానంగా చూడాలన్నారు. ఆడపిల్లలపై వివక్ష పోవాలంటే మహిళల్లో చైతన్యం రావాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. ఆడపిల్లలకు తొందరగా వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారన్నారు. బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయన్నా రు. బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమన్నా రు. కార్యక్రమంలో న్యాయవాది ఐ.రమేష్, ప్రాంగణం మేనేజర్ సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement