స్కిట్‌కు మహర్దశ ! | Sakshi
Sakshi News home page

స్కిట్‌కు మహర్దశ !

Published Mon, Nov 3 2014 3:46 AM

Boom few months!

  • రూ.50కోట్లతో అభివృద్ధికి రంగం సిద్ధం
  •  ప్రభుత్వ పాలిటెక్నిక్  కళాశాల మంజూరు
  •  స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీకాళహస్తీశ్వరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(స్కిట్) ఇం జనీరింగ్ కళాశాలకు మహర్దశ రానుం ది. రూ.50కోట్లతో కళాశాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపోమాపో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రధానంగా స్కిట్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూ రు చేసినట్లు సమాచారం.

    అంతేకాదు కళాశాల ప్రాంగణంలో గ్రామీణ ప్రాంతవాసుల కోసం నవంబర్ 10వ తేదీపైన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి రెండు రోజుల క్రితం అనుమతులు లభించాయి.మరోవైపు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ ఆలయాలు ఉన్నచోట వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పా టు చేయనున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి ముందు వరుసలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.ఆ మేరకు భూసమీకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

    అరవకొత్తూరు చెరువులో 1997లో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే చెరువులో సగభాగం మాత్రమే కళాశాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన భాగాన్ని నూతన కళాశాలలకు వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తోన్నాయి.
     
    స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం రూ.10లక్షల మంజూరు

    స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను స్కిట్ కళాశాలలో ప్రారంభించడానికి అడ్వాన్సుగా రూ.10 లక్షలు మంజూరైంది. ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లినప్పటికీ వారికి అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఎంపిక కావడంలేదనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఉంటాయి. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లు చెన్నై,బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే ఉన్నాయి. శిక్షణకు ఒక్కో విద్యార్థికి రూ.20వేలు చెల్లించాల్సి ఉంది.

    అయితే ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.10వేలు, శ్రీకాళహస్తి దేవస్థానం రూ.10వేలు స్కిట్‌కు చెల్లించనున్నాయి. శిక్షణకు అవసరమైన ప్రత్యేక నిపుణులు, అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్స్‌ను ప్రభుత్వ ఐటీ శాఖ నుంచి మంజూరు చేయనున్నారు. రెండు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఒక్కో బ్యాచ్‌కి 60మంది చొప్పున ఏడాదికి 300మందికి శిక్షణ ఇవ్వనున్నారు. స్థానికులకు, స్కిట్ కళాశాలలో చదివిన విద్యార్థులకు ఉచితంగాను, ఇతర కళాశాలల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉచితంగా అవకాశం కల్పిం చాలా ? కొంతమేరకు ఫీజు వసూలు చేయాలా ? అనే అంశాలపై తర్జనభర్జన పడుతున్నారు.
     

Advertisement
Advertisement