Sakshi News home page

ప్రేమికురాలి కోసం నేరాలు

Published Wed, Jan 8 2014 3:26 AM

ప్రేమికురాలి కోసం నేరాలు

 మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : ప్రేమ వ్యామోహం ఓ యువకుడితో తప్పులు చేయించింది. ప్రేమించిన మైనర్‌ను ఎలాగైనా సొంతం చేసుకునేందుకు తప్పు లు మీద తప్పులు చేసి కటకటాల పాలయ్యాడు. టౌన్ సీఐ ఎస్.వి.వి.ఎస్.మూర్తి, ఎస్సై భాస్కర్ మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలియజేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకా రం.. బందరు మండలం చిన్నాపురానికి చెం దిన నూకల దుర్గారావు మచిలీపట్నం భాస్కరపురంలో  ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ యువకిరణాలులో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. అదే సెం టర్‌లో ఓ మైనర్ యువతి కంప్యూటర్ కోర్సులో శిక్ష ణ కోసం చేరింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. దుర్గాప్రసాద్ మాయమాటలతో ఆమెను ప్రేమలోకి దించాడు. గత ఏడాది మేలో ఇద్దరూ ద్వారకా తిరుమలకు వె ళ్లి అక్కడ దండలు మార్చుకున్నారు. ఇద్దరికీ పెళ్లయిపోయిందని నమ్మించాడు.
 
  అనంత రం ఆమెను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. మైన ర్ స్వస్థలం ఘంటసాల. దుర్గారావు ఘం టసాల తహశీల్దార్‌ను కలిసి ఆ యువతి పుట్టినపుడు జనన నమోదులో పేరు నమోదు చేయలేదని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలని కోరుతూ ఆమె తండ్రి పేరిట దరఖాస్తు చేశాడు. అందుకు అవసరమైన పత్రాలు నకిలీవి సృష్టించి అందజేశాడు. ఆ యువతి మచిలీపట్నంలోని ఓ కళాశాలలో చదువుతున్నట్లు కొన్ని రోజులకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌ను పొందాడు. అనంతరం ఓ న్యాయవాది ద్వారా తన భార్య మేజర్ అని, కాపురానికి పంపాలని ఆమె తల్లిదండ్రులకు నోటీసు జారీ చేశాడు. అయితే సదరు యువతి బాలుర పాఠశాలలో పదో తరగతి చదివి నట్లు, 1995లో పుట్టినట్లు సర్టిఫికెట్‌లో ఉండటాన్ని ఆమె తండ్రి గమనించారు. వాస్తవానికి ఆమె 1996 లో పుట్టింది. దీనిపై అనుమానం వచ్చి వివరాలు కోసం ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అక్కడి నుంచి అం దిన సమాచారంతో దుర్గాప్రసాద్ ఉదంతం బయటపడింది. దీంతో అతడిపై యువతి తండ్రి మచిలీపట్నం పోలీసులకు ఈ నెల నాలుగో తేదీన ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. వారి దర్యాప్తులో దుర్గాప్రసాద్ నేరాలకు సంబంధించి ఆధారా లు లభించాయి. దీంతో మంగళవారం అతడిని అ రెస్టు చేసినట్లు సీఐ మూర్తి తెలిపారు

Advertisement
Advertisement