బీఆర్‌ అంబేద్కర్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళులు

14 Apr, 2019 11:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్‌ జయంతి వేడుకలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఏపీ అంతటా ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్‌ జగన్‌తోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. 

అనంతపురం: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి తలారిరంగయ్య, అనంతపురం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నదీంఅహ్మద్‌లు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ సేవలను స్మరించుకున్నారు.

వైఎస్సార్ జిల్లా: కడపలో అంబేద్కర్‌ జయంతి వేడుకను వైఎస్సార్‌ సీపీ నేతలు ఘనంగా జరిపారు. నగరంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ సురేష్ బాబు, కడప కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు అంజాద్ బాషా,రవీంద్రనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంబేద్కర్ జయంతి వేడుకను వైఎస్సార్‌ సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత శివ ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

విజయవాడ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పొట్లూరి వీరప్రసాద్‌, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌, కాలే పుల్లారావు,శ్యామ్‌, రమేశ్‌, బూదల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు