Sakshi News home page

కుక్క పాలు తాగుతున్న గేదె దూడ

Published Tue, Oct 3 2017 11:53 AM

Buffalo calf drinks dog milk  - Sakshi

తూర్పుగోదావరి , గొల్లప్రోలు : కుక్క పాలు గేదె దూడ తాగుతున్న సంఘటన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చోటుచేసుకుంది. స్థానిక అపర్ణాదేవి గుడి సమీపాన రైతు దాసం రామకృష్ణ ఇంటి వద్ద పెంపుడు కుక్క పాలను గేదె దూడ తాగడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 15 రోజుల క్రితం ఈ కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆయన ఇంట పుట్టిన 20 రోజుల వయసు ఉన్న గేదె దూడ ఆ కుక్క పాలు తాగడం అలవాటు చేసుకుంది. తల్లి గేదె పాలతోపాటు ప్రతి రోజూ కుక్క పాలు కూడా తాగుతోంది. కుక్క కూడా తన పిల్లలతో పాటు గేదె దూడకు కూడా పాలివ్వడం అలవాటు చేసుకుంది. కుక్క ఈనినప్పటి నుంచి గేదె దూడ ఆ కుక్క పాలు తాగుతోందని రైతు రామకృష్ణ చెప్పారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ వింతను చూడడానికి ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement