కీలక ఫైళ్లు బుగ్గిపాలు! | Sakshi
Sakshi News home page

కీలక ఫైళ్లు బుగ్గిపాలు!

Published Sat, Apr 4 2015 1:20 AM

Buggipalu critical files!

  • బ్రిజేశ్ ట్రిబ్యునల్ కార్యాలయ ప్రమాదంలో ఫైళ్లు దగ్ధం
  • వాటి వివరాలు కోరిన ఏపీ, తెలంగాణ
  • ట్రిబ్యునల్ సమావేశాల్లో జాప్యం జరిగే అవకాశం
  • సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాలపై వాదనలు వింటున్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో గత నాలుగేళ్ల వాదనల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రా లు వినిపించిన వాదనల తాలూకు రికార్డులు, ట్రిబ్యునల్ సభ్యులు పొందుపరుచుకునే పరిశీల నాంశాల రికార్డులు కొన్ని ఈ ప్రమాదంలో కాలి పోయినట్లుగా సమాచారం. బ్రజేష్ ట్రిబ్యునల్ సమావేశాలు గత నెల 30న మొదలై మూడు రోజులపాటు జరగాల్సి ఉంది.

    గత వాదనల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రలు వాదనలు వినిపించగా తర్వాతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రా లు వాదనలు వినిపించాల్సి ఉంది. వాదనలకు అంతా సిద్ధమైన వేళ సమావేశాలు ముందు రోజు కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిం ది. దీంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. కీలక రికార్డులు దహనమైనట్లు సమాచారం అందుకున్న ఏపీ, తెలంగాణ అధికారులు రికార్డుల వివరాలు తెలియజేయాలని ట్రిబ్యునల్ కా ర్యాలయ సిబ్బందిని కోరారు.

    దీంతో ట్రిబ్యున ల్ కార్యాలయ సిబ్బంది వాటి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. దహనమైన రికార్డుల వి వరాలు బయటకు వచ్చేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ సమావేశాలు ఇప్పట్లో జరగడం సా ద్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement