ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు

Published Sun, Apr 19 2015 5:43 PM

ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు - Sakshi

రాజమండ్రి(సామర్లకోట): తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామంలో ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు ఆసక్తికరంగా సాగాయి. తూర్పు గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి మూడు బహుమతులను తూర్పు గోదావరి జిల్లా ఎద్దులే కైవసం చేసుకోవడం విశేషం.

పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరుకు చెందిన చుండ్రు సత్యనారాయణ ఎడ్లు 4 నిమిషాల 10 సెకెన్ల 31 పాయింట్లలోను, కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన తుమ్మల మణికంఠ ఎడ్లు 4 నిమిషాల 10 సెకెన్ల 47 పాయింట్లతోను, సామర్లకోట మండలం కాపవరం గ్రామానికి చెందిన కుంచం మనోజ్ ఎడ్లు 4 నిమిషాల 16 సెకెన్ల 40 పాయింట్లతోను వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement
Advertisement