ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన 'కాగ్' | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన 'కాగ్'

Published Sat, Sep 6 2014 11:42 AM

CAG Report Submitted to AndhraPradesh Assembly

రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పలు అంశాలపై కాగ్ అందించిన నివేదికను ఏపీ ప్రభుత్వం శనివారం ఆ రాష్ట్ర శాసనసభకు సమర్పించింది. కాగ్ నివేదికలో ప్రధాన అంశాలు... గోదావరి, వంశధార, నాగావళి వరదకట్టు నిర్మాణంలో లోపాలున్నాయని  వెల్లడించింది. దీని వల్ల రూ. 904 కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. రోడ్లు మరియు భవనాల శాఖలో రోడ్ల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని... పీపీపీ విధానం అమలు తీరులో సరైన ప్రమాణాలు పాటించలేదని ఆరోపించింది. అటవీ భూముల మళ్లింపులో నిబంధనలు అతిక్రమించారని విమర్శించింది. చివరకు ఎత్తిపోతల పథకాలపై కూడా నిర్లక్ష్యం వహించారని... అయితే ఆ పథకాలను పునరుద్దరించాలని తన నివేదికలో కాగ్ సూచించింది.

వైద్య ఆరోగ్యశాఖ పనితీరు సక్రమంగా లేదని... నిధులు దారి మళ్లుతున్నాయని పేర్కొంది.  చివరకు బయోమెట్రిక్ విధానం లేకపోవడంతో పౌరసరఫరాల శాఖలో నిధులు దుర్వినియోగమవుతున్నాయని తెలిపింది. బోగస్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని... కుటుంబాల సంఖ్య కంటే రేషన్కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పింది. తాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2.528 కోట్లు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరలేదంది. విద్యాశాఖలోని రూ. 54 కోట్ల నగదు ప్రభుత్వ ఖాతలోకి బదులు సొంత ఖాతాలోకి వెళ్లాయిని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా... ఆ పని చేయలేని పేర్కొంది.  పర్యావరణ అనుమతులు లేకుండా నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని... దీని వల్ల ముంపు ఏర్పడుతుందని కాగ్ రిపోర్ట్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement