భారీగా గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత

Published Fri, Aug 1 2014 12:43 AM

భారీగా గంజాయి పట్టివేత - Sakshi

  •      రూ. 20 లక్షల విలువైన 400 కిలోలు స్వాధీనం
  •      ఇద్దరి అరెస్టు
  • గొలుగొండ: ఏజెన్సీలో మరోసారి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం కె.డి.పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లూరి పార్కు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేపట్టారు. చింతపల్లి ఘాట్‌రోడ్డు నుంచి రంపుల మీదుగా కె.డి.పేట వస్తున్న ఒక వ్యాన్‌ను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది.

    పనసకాయల లోడు అడుగున 16 బస్తాల గంజాయి ఉంది. దాదాపు 400 కిలోలు ఉన్న దీని విలువ రూ. 20 లక్షల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యాన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, వ్యాన్‌ను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఎస్సై గోపాలరావు, ఏఎస్సై రాజారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
     
    అనంతగిరిలో రెండున్నర కిలోలు స్వాధీనం

     
    అనంతగిరి: ఆటోలో ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్న రెండున్నల కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ఎస్సై గోపాలకృష్ణ గురువారం తెలిపారు. అనంతగిరి మండలం వాలసి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు చెప్పారు. బుధవారం రాత్రి చిలకలగెడ్డ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి దొరికిందని వివరించారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement