సీఏలు దేశాభివృద్ధికి తోడ్పడాలి | Sakshi
Sakshi News home page

సీఏలు దేశాభివృద్ధికి తోడ్పడాలి

Published Thu, Dec 8 2016 2:29 AM

సీఏలు దేశాభివృద్ధికి తోడ్పడాలి - Sakshi

సీఏల ముగింపు సదస్సులో రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్
 
 తిరుపతి: చార్టర్డ్ అకౌంటెంట్లు దేశాభివృద్దికి తోడ్పడాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్.రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలో నిరంతర మార్పులు అవసరమని చెప్పారు. బుధవారం తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో జరిగిన సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) 48వ వార్షిక సదస్సు ముగింపు సమా వేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణభారత దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 2,500 మంది సీఏలు హాజరయ్యారు.

రమేశ్‌కుమార్ మాట్లాడుతూ సీఏ వృత్తి ఎంతో గొప్పదని, ప్రతి వ్యక్తి, సంస్థ ఆడిటర్‌ల సలహాలను తీసుకొని వ్యక్తిగతం గానూ అభివృద్ది సాధించాలని సూచించా రు. ఐసీఏఐ చైర్మన్ ఎం.దేవరాజారెడ్డి మాట్లాడుతూ సీఏ కోర్సు నిర్వహణలో అనేక మార్పులు తెస్తున్నామని, కొత్త సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీని వల్ల  సీఏ కోర్సుకు అంతర్జాతీయ స్థారుులో గుర్తింపు లభిస్తుందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ వైస్ చైర్మన్ నీలేశ్ శివ్‌జీ వికమ్‌సే, ఐస్‌ఐఆర్‌సీ చైర్మన్ ఫల్గుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement