విద్యారంగాన్ని నీరుగార్చిన ప్రభుత్వాలు | Sakshi
Sakshi News home page

విద్యారంగాన్ని నీరుగార్చిన ప్రభుత్వాలు

Published Mon, Apr 14 2014 2:55 AM

cation, governments have diluted the govts

ఎస్టీఎఫ్‌ఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి రాజేంద్రన
సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్‌ది కీలక పాత్ర

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యారంగ సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ కీలక పాత్ర పోషించిందని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ సూచించారు. దోమలగూడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ రెండు రాష్ట్రాల కమిటీల సంయుక్త సమావేశానికి ఆయన హాజరయ్యారు. విద్యారంగ ప్రైవేటీకరణ పేదలకు విద్యనందించాలనే లక్ష్యాన్ని నీరుగారుస్తుందని, చదువుకునే వారికి కాకుండా, చదువుకొనే వారికే విద్యావకాశాలనే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పాలకుల దోపిడీ విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం అన్నారు.
 
ఉమ్మడి రాష్ట్రంలోనే 10వ పీఆర్సీ అమలు చేయాలి

 పదో పీఆర్సీని ఉమ్మడి రాష్ట్రంలోనే అమలు చేయాలని యూటీఎఫ్ కార్యవర్గం డిమాండ్ చేసింది. గౌరవాధ్యక్షుడు నారాయణ, అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావులు సమావేశ తీర్మానాలను విలేకరులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం డీఏను జనవరి 1 నుంచి చెల్లించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా 8. 53 శాతం డీఏను వెం టనే ప్రకటించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పని చేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగుల సమస్యలను ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 2లోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  
 
యూటీఎఫ్‌కు రెండు కమిటీలు


1.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు యూటీఎఫ్ నూతన కమిటీలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా ఐ.వెంకటేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పి.బాబురెడ్డి, గౌర వాధ్యక్షుడిగా షేక్ సాబ్జీ, సహాధ్యక్షులుగా కె.విజయగౌరి, ఎన్.నర్సింహుడు, కోశాధికారిగా ఎన్.తాండవ కృష్ణను నియమించారు. కె.ఎన్.ఎన్.ప్రసాద్, ఎన్.సోమచంద్రారెడ్డి, ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, కె.ఉమామహేశ్వర్‌రావు ఆఫీసు బేరర్లుగా నియమితులయ్యారు.  ఆంధ్రప్రదేశ్ శాఖ‘ ఐక్య ఉపాధ్యాయ’ పత్రిక ప్రధానసంపాదకులుగా సీహెచ్.సుభాష్‌చంద్రబోస్, ఆడిట్ కమిటీ కన్వీనరుగా బి.వి.రమణమూర్తి, ఎన్నికల అధికారిగా డి.రామిరెడ్డి నియమితులయ్యారు.
2. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చావ రవి, గౌరవాధ్యక్షుడిగా ఎన్.నారాయణ, సహాధ్యక్షులుగా మాణిక్‌రెడ్డి, సీహెచ్.దుర్గాభవాని, కోశాధికారిగా ఎన్.కృష్ణయ్య, ఆఫీసు బేరర్లుగా బి.నరసింహారావు, టి.లక్ష్మారెడ్డి, సి.రాములు నియమితులయ్యారు. తెలంగాణ శాఖ ‘ఐక్య ఉపాధ్యాయ’ పత్రిక ప్రధానసంపాదకులుగా ఎన్.నారాయణ, అడిట్ కమిటీ కన్వీనరుగా సీహెచ్‌వీ.రాజన్‌బాబు, ఎన్నికల అధికారిగా ఎం.సంయుక్త నియమితులయ్యారు.

Advertisement
Advertisement