విశాఖ, ముంబైలో సీఈఎంఎస్‌ సంస్థలు  | Sakshi
Sakshi News home page

విశాఖ, ముంబైలో సీఈఎంఎస్‌ సంస్థలు 

Published Wed, Nov 22 2017 2:45 AM

CEMS companies in Visakhapatnam and Mumbai - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: షిప్పింగ్‌ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముంబై, విశాఖపట్నం నగరాల్లో ప్రపంచస్థాయి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ (సీఈఎంఎస్‌) సంస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర షిప్పింగ్‌శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గత వారం కొచ్చిన్‌లో ప్రకటించారు. సాగర్‌మాల పథకంలో దీనిని ప్రధాన అంశంగా తీసుకోనున్నారు. షిప్పింగ్‌ పరిశ్రమ సంబంధిత నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు రూ.766 కోట్లతో ఈ రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నారు.

బహుళజాతి సంస్థ సిమెన్స్, ఇండియన్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ (ఐఆర్‌ఎస్‌) సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర షిప్పింగ్‌ శాఖ వీటిని ఏర్పాటు చేయనుంది. షిప్‌ డిజైన్, తయారీ, నిర్వహణ, మరమ్మతులు తదితర సేవల్లో అవ సరమైన నైపుణ్యాలను అందించడం ఈ క్యాంపస్‌ల ప్రధాన లక్ష్యం. సాంకేతికత, నైపు ణ్యాలతో పాటు 87 శాతం నిధులను సిమెన్స్‌ సంస్థ గ్రాంటుగా అందిస్తోంది. విశాఖపట్నం క్యాంపస్‌ కోసం ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ) స్థలం, భవనం సమకూర్చింది. క్యాంపస్‌లను తొలి రెండేళ్లపాటు సీమెన్స్‌ సంస్థ నిర్వహిస్తుంది. తదుపరి ఐఆర్‌ఎస్‌ ఏర్పాటుచేసే ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ నిర్వహిస్తుంది. 

Advertisement
Advertisement