పోలవరంపై కేంద్రం చర్యలు షురూ! | Sakshi
Sakshi News home page

పోలవరంపై కేంద్రం చర్యలు షురూ!

Published Tue, Sep 5 2017 1:18 AM

పోలవరంపై కేంద్రం చర్యలు షురూ! - Sakshi

- పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాపై బదిలీ వేటు
ఆ బాధ్యతలు కృష్ణాబోర్డు చైర్మన్‌ శ్రీవాస్తవకు అప్పగింత
 
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై క్షేత్ర స్థాయి పరిస్థితులకు భిన్నంగా నివేదికలు ఇచ్చిన పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాపై కేంద్రం వేటు వేసింది. కృష్ణా  బోర్డు ఛైర్మన్‌ ఎస్‌.కె.శ్రీవాత్సవకు పీపీఏ సభ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది.. మసూద్‌ హుస్సేన్‌ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలకు ఉపక్రమించడం కలకలం రేపుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతేడాది సెప్టెంబరు 7న ప్రకటించిన ‘ప్రత్యేక ప్యాకేజీ’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించిన సంగతి తెల్సిందే. ఏప్రిల్‌ 1, 2014 నుంచి పోలవరం పనులకు చేసిన ఖర్చులను రీయింబర్స్‌ చేయడంతో పాటు.. విద్యుదుత్పత్తి ప్రాజెక్టు, తాగునీటి పథకానికి అయ్యే ఖర్చు మినహా నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. 2014–15, 2015–16, 2016–17లలో విడుదల చేసిన రూ.3,364.70 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పకపోగా మరో రూ.3,793 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.  దీనిపై ఇచ్చిన వివరణలు సరిగ్గా లేకపోవడంతో ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని చర్యలకు దిగింది.

Advertisement
Advertisement