నా మొర కేంద్రం ఆలకించలేదు... | Sakshi
Sakshi News home page

నా మొర కేంద్రం ఆలకించలేదు...

Published Thu, Feb 26 2015 3:38 AM

నా మొర కేంద్రం ఆలకించలేదు... - Sakshi

- రాష్ట్రపతి సూచననూ పట్టించుకోలేదు
- విలేకరుల సవూవేశంలో సీఎం చంద్రబాబు అసంతృప్తి
- పత్యేక ప్యాకేజీ లేదు, రాజధానికి నిధులూ లేవు
- కాంగ్రెస్, ఎన్డీఏలు కలసి రాష్ట్రాన్ని విభజించాయి
- కేంద్ర వైఖరిని ప్రజలు గమనించాలి

 
సాక్షి, చిత్తూరు: ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తగిన ప్రాధాన్యతనివ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేశానని, రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని రాష్ట్రపతి కూడా సూచించారని అయినా కూడా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఆమోదం లభించిన నేపథ్యంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒకపక్క కేంద్ర పట్టించుకోలేదని చెప్పిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై ఘర్షణ వైఖరి ఉండదని, విన్నపాలతో సరిపెడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 22 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఇవ్వాలని కోరగా.. ఒకేసారిగాక ఐదేళ్లలో ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు. మిగిలిన రాష్ట్రాలతో సవూనంగా ఎదిగే వరకూ సహకారం అందించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫైనాన్స్ కమిటీకి నివేదించామన్నారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించి నిధులివ్వకపోతే 20, 30 ఏళ్లకు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు. రాబోయే ఐదేళ్లలో కేంద్రం ఇచ్చే నిధులు రెవెన్యూ లోటుకు మాత్రమే సరిపోతాయని, కొత్త రాజధాని నిర్మాణం, ప్రస్తుత పాలన నిర్వహణ ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. సాధారణంగా ఇచ్చే నిధులుకాక రూ. 1,41,467 కోట్లు ప్రత్యేకంగా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ. 1.7 లక్షల కోట్ల లోటు ఉంటుందని, ప్రస్తుతమున్న రెవెన్యూ లోటు 22 వేల కోట్లు కలిపి రూ. 1,92,789 కోట్లు ఉంటుందని అంచనా వేసి ఆ మొత్తాన్ని వూత్రమే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం కావడం అన్యాయువున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే ఐదేళ్లలో రూ. 1,18,678 కోట్లు మిగులులో ఉంటుందన్నారు. మనం బిహార్, ఒడిశా కంటే వెనుకబడతావుని చెప్పారు. రాష్ట్ర విభజనను ప్రజలు కోరుకోలేదని, ఆనాటి కాంగ్రెస్, ఎన్‌డీఏ కలిసి రాష్ట్రాన్ని చీల్చాయుని విమర్శించారు. ఆర్థిక సంఘం పన్నుల వాటాను 42 శాతానికి పెంచడం స్వాగతించే విషయువున్నారు.  రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకున్నావుని,  కేంద్రం సహకరించకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర వైఖరిని ప్రజలు గవునించాలన్నారు.
 
కుప్పం నుంచి అభివృద్ధి ప్రారంభం.. కుప్పం నుంచి ప్రారంభించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం బహిరంగ సభలో ప్రసంగించారు.
 
బాబు ఢిల్లీ పర్యటన రద్దు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం వెళ్లతలచిన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. బడ్జెట్ సమావేశాల కారణంగా ప్రధానితో భేటీకి  అనుమతి లభించనందున రద్దుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement