రాష్ట్రాభివృద్ధికి సహకరించని కేంద్రం | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధికి సహకరించని కేంద్రం

Published Thu, Jun 23 2016 3:07 AM

రాష్ట్రాభివృద్ధికి సహకరించని కేంద్రం - Sakshi

 ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి

ఓర్వకల్లు: రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత రుణ మాఫీ ఉపశమన అర్హత కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 80 శాతం భూ సమస్యలను పరిష్కరించామన్నారు. అయినా రెవెన్యూ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సకాలంలో పడ్డాయని, రైతులు వ్యవసాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సబ్సిడీ పథకాలను అన్నదాతలకు సకాలంలో అందజేయాలని  కోరారు. జిలా ్లకలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ..  రెండో విడత జిల్లాలో 2.73 లక్షల మంది రైతులకు రూ.251 కోట్లు రుణ మాఫీ అయిందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర మహిళా సాధికార సంస్థ ప్రతినిధురాలు విజయభారతి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జేసీ-2 రామస్వామి, ఆర్‌డీఓ రఘుబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి, గ్రామ సర్పంచ్ పెద్దయ్య, ఏవో మధుమతి, ఎంపీడీఓ మాధవీలత, తహశీల్దార్ రామాంజులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


 పారదర్శంగా బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బదిలీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా బదిలీలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకొని బదిలీలు నిర్వహించామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement