బీసీలపై బాబు మొసలి కన్నీరు | Sakshi
Sakshi News home page

బీసీలపై బాబు మొసలి కన్నీరు

Published Fri, Apr 11 2014 4:08 AM

chandra babu naidu against to bc's

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట),  న్యూస్‌లైన్ :దెందులూరు కోటపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తామని పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్ర శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీలో చేరిన సందర్భంగా శనివారపు పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడారు.
 
 బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామని, వారి అభ్యున్నతికి పాటుపడతామని చంద్రబాబు ఇస్తున్న హామీలన్నీ బూటకమన్నారు. దెందులూరు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు 80 శాతం మంది ఉండగా, ఒక్కసారైనా బీసీలకు చంద్రబాబు సీటు ఇవ్వలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో తొలిసారిగా బీసీ అభ్యర్థికి జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇవ్వనున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీకి క ష్టపడే నాయకులు ఉన్నారని పేర్కొన్నారు.  
 
గత నాలుగేళ్లుగా పీవీ రావు, చలుమోలు అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, ఘంటా ప్రసాదరావు, చంద్రమౌళి వంటి నాయకులు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారని అభినందించారు. దెందులూరు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా కారుమూరిని ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తోట చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలి పారు. ప్రజాబలం లేకపోయినా టీడీపీ బలం పెరిగినట్టుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఆ పార్టీకి బలం పెరిగితే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
 
 రాష్ట్రాభివృద్ధిపై వైఎస్ జగన్‌కు విజన్ ఉంది : కారుమూరి
 ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ తాను నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. వారిపై ఈగ వాలితే తనపై వాలినట్టేనన్నారు. తాను ఏ వర్గానికి అపకారం చేయనని అందరికీ ప్రేమ పంచుతానని తెలి పారు. తనకు బంధువులు, మిత్రులు కార్యకర్తలేనని అన్నారు. తాను బతుకుతూ పదిమందిని బతికించడమే తన కర్తవ్యం అన్నారు.

తనకు గతంలో కాంగ్రెస్ వారితో స్నేహ సంబంధాలు ఉన్నా వాటిని అంతటితో వదిలి వేసి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని చెప్పారు. దెందులూరు నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక విజన్ ఉందని, ఆయన విజన్‌కు తగ్గట్టు తాను, తోట చంద్ర శేఖర్ పని చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు యు.
 
 చంద్రమౌళి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో రాక్షన పాలన సాగుతోందని, దీనిని అడ్డుకుని కార్యకర్తలకు అండగా నిలవగల శక్తి సామర్థ్యాలు కారుమూరికి ఉన్నాయన్నారు. పార్టీ నాయకులు ఘంటా ప్రసాదరావు,  మాజీ మంత్రి మరడాని రంగారావు, బొద్దాని శ్రీనివాస్, బొమ్మారెడ్డి చంద్రారెడ్డి, పోకల రాంబాబు, ఆళ్ల సతీష్ చౌదరి, గుత్తా ప్రసాద్, నెర్సు వెంకట సుబ్బారావు, యాదవ్, అప్పన ప్రసాద్, సూర్యం మాస్టారు, ముంగర సంజీవి, గంగాభవాని, జి.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
 
 కారుమూరికి ఘన స్వాగతం
 బుధవారం హైదరాబాదులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి గురువారం గన్నవరం విమానాశ్రంలో దిగిన కారుమూరికి దెందులూరు, ఏలూరు, పెదపాడు, తణుకు ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయస్వామి దర్శించుకుని  ర్యాలీగా ఏలూరు చేరుకున్నారు.
 

Advertisement
Advertisement