టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు | Sakshi
Sakshi News home page

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు

Published Fri, May 29 2015 3:39 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు - Sakshi

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఆయన ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు అనివార్యమైంది.

 

దీనిలో భాగంగానే మహానాడులో ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు అయ్యాయి. పార్టీలో ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు ఈరోజు నుంచి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement