బాబూ.. తెలంగాణను స్వాగతించారుగా: డీఎస్ | Sakshi
Sakshi News home page

బాబూ.. తెలంగాణను స్వాగతించారుగా: డీఎస్

Published Tue, Oct 8 2013 2:06 AM

Chandra babu naidu welcomed Telangana, says D Srinivas

తెలంగాణపై నిర్ణయం వెలువడిన వెంటనే స్వాగతించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఇప్పుడు న్యాయం, ధర్మం అంటూ దీక్షకు ఎందుకు దిగారో తనకు అర్థం కావడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర విభజనపై సరైన సంప్రదింపులు లేకుండానే కేంద్రం విభజనకు పూనుకుందన్న బాబు వ్యాఖ్యలను డీఎస్ ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పార్టీలను సంప్రదించడం వల్లే చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని గుర్తుచేశారు. డీఎస్ సోమవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. 2009 అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారని, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. విభజనకు అనుకూలంగా లేకపోతే ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని, లేఖలు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయిందన్నబాబు వ్యాఖ్యలనూ ఖండించారు. కోర్డులను, న్యాయమూర్తులను పార్టీలు ప్రభావితం చేసే స్థాయిలో దేశం ఉందా? అని డీఎస్ ప్రశ్నించారు.

Advertisement
Advertisement